అయితే ఈ సారి ప్రేమికుల పప్పులు ఉడకవంటూ పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రేమికుల రోజు ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ఉండేందుకు నగరం లోని మెయిన్ మెయిన్ పార్కులను మూసి వేశారు. మరో వైపు భజరంగ్ దళ్ కార్యకర్తలు లవర్స్ ను అడ్డుకుంటామని ప్రకటించడంతో ప్రేమికులకు మరో షాక్ తగిలింది. ప్రేమికుల రోజు వచ్చేసిందోచ్ ప్రేమ పక్షులు మరో లోకంలో విహరించే రోజు ఇదేనంటూ మనసుకు రెక్కలు తొడుగుకుని పరుగులు తీయాలని అనుకున్న వారి కాళ్ళకి కళ్లెం వేసినట్లు అయ్యింది.
రెండు మనసులు కలిసి ప్రేమలో మునిగిన ఇద్దరు మనుషులు జాలీగా జరుపుకునే డెస్టినేషన్ కాస్త ఇలా శాడ్ ఎండింగ్ అయిందన్నమాట. కానీ వారు ఈ రోజున ఎక్కడో ఒక దగ్గర అంతకు మించిన సంతోషంతో జరుపుకుని ఉంటారు. కానీ దేశంలో చాలా చోట్ల బయట పార్క్ లలో ఎవరైనా ప్రేమికులు తిరిగితే పెళ్లిళ్లు చేసిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. అయితే ఈ తరహా ఘటనలు ఈరోజు ఏమైనా జరిగాయా లేదా అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. అందుకే మనము కూడా ఈ రోజు అలంటి ఎందరో ప్రేమికులకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలియ చేద్దాము.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి