ప్రస్తుతం ఎండాకాలం కావడంతో మన శరీర ఉష్ణోగ్రతలు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వాతావరణంలో మన శరీరం చల్లగా ఉండాలి అంటే . మన గుండె కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక గుండె సమస్యతో ఉన్నవారు ఈ వేసవికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే పక్షవాతం,  గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ మన శరీరంలోని కదలికల్లో కూడా మార్పులు వస్తూంటాయి. మన శరీరంలో అన్ని భాగాలు చల్లగా ఉండేందుకు గుండె వేగంగా రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. ఇక అధిక వేడి వల్ల అది చాలా కష్టం అవుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. అందుకోసం ఈ వేసవిలో గుండె పదిలంగా ఉండాలంటే ఈ చిట్కాలను పాటిస్తే చాలట.

ఈ వేసవి కాలంలో వ్యాయామం చేయడం వల్ల గుండెకు అవసరమైన రక్తప్రసరణ వేగాన్ని పంపిస్తుంది. అందుచేతనే వ్యాయామం ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేయాలి. మిట్ట మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా బయట తిరగకపోవడం మంచిది.

గుండె సమస్యలతో ఇబ్బంది పడే వారు ప్రతిరోజు కచ్చితంగా నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. అందుచేత వారి యొక్క శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుందని చెప్పవచ్చు. హృదయ స్పందనలను క్రమబద్దీకరించడనికి , వ్యర్థాలను బయటకు పంపించడానికి తగిన నీరు అవసరం. అందుచేతనే ప్రతి ఒక్కరు ఎక్కువగా నీటిని తాగడం మంచిది.

ఈ వేసవి కాలంలో కాఫీ, ఆల్కహాల్ అనేవి  తాగకపోవడం చాలా మంచిది. గుండెజబ్బులతో ఉన్నవారు వీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటికీ బదులుగా నిమ్మరసం, మజ్జిగ తాగడం చాలా మంచిదట.

సాయంత్రం వేళలో స్పైసి, ఆయిల్ ఫుడ్ ని తినకపోవడం చాలా మంచిది. ముఖ్యంగా కూరగాయలు,  తృణధాన్యాలు,  గింజలు వంటివి తినడం మంచిదట.


అయితే దీర్ఘకాలిక గుండె సమస్యతో బాధపడే వారు వైద్యుని సంప్రదించి వారు చెప్పేటువంటి వాటిని పాటించడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: