మనం కూరలలో వేసే కరివేపాకుని తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. కానీ కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఏ ఒక్కరూ కూడా కరివేపాకుని తినడానికి ఇష్టపడరు. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా అధిక బరువుతో ఇబ్బంది పడేవారి సంఖ్య రోజుకూ పెరిగిపోతుంది . ఇక ఈ క్రమంలోని అధిక బరువు నుంచి బయటపడాలి అంటే తప్పకుండా కొన్ని రకాల ఉత్పత్తులను వినియోగించాల్సిందే. లేకపోతే ఇంటి చిట్కాలను పాటిస్తూ నిపుణుల సలహా ప్రకారం బరువు నియంత్రణలో పెట్టుకోవచ్చు.

ముఖ్యంగా బరువును తగ్గించే గుణాలు కరివేపాకులో ఎక్కువగా ఉన్నాయని అధిక బరువును నియంత్రించడంలో కరివేపాకు సహాయపడుతుంది అని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. ఇక కరివేపాకులో ఉండే పోషకాల విషయానికి వస్తే ఐరన్, జింక్, క్యాల్షియం, కాపర్, విటమిన్ బి ,అమైనో ఆమ్లాలు, విటమిన్ ఏ, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫోలిక్ యాసిడ్ మొదలైనవి ఉంటాయి. ఇక ఇవన్నీ కూడా మీ  శరీర బరువును నియంత్రిస్తాయి. ఇకపోతే కరివేపాకును నేరుగా తీసుకోవడానికి ఇష్టం లేని వాళ్ళు కరివేపాకుతో రైస్ చేసుకొని తినవచ్చు.

ఇక లేదా కరివేపాకు రసం చేసుకుని తాగినా మంచి ఫలితాలు లభిస్తాయి. ఇకపోతే ముందుగా గుప్పెడు కరివేపాకులను తీసుకొని ఒక గ్లారు నీరు పోసి మెత్తటి జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఫిల్టర్ చేసి కొద్దిగా పుదీనా ఆకలను కూడా వేసుకోవచ్చు ఉదయాన్నే తాగడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభించడంతోపాటు బరువు క్రమంగా తగ్గిపోతారు. ముఖ్యంగా కరివేపాకును నీటిలో ఉడికించి ఆ తర్వాత చల్లార్చి కొద్దిగా నిమ్మరసం, తేనె జోడించి తాగినా సరే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే పరగడుపున మాత్రమే తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. అంతేకాదు డయాబెటిస్ వారు కూడా నిక్షేపంగా తాగవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: