కళ్లు మరింత అందాన్ని అందించేందుకు మేకప్ వేస్తున్నారు మహిళలు.. చాలామంది అందంగా కనిపించాలనే మోజుతో పలు సౌందర్య ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ మొదలవ్వడం తో వీటి డిమాండ్‌ సైతం పెరిగింది.. మహిళలు కోల్‌ ఐ లైనర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఇది కళ్లకు హాని చేస్తుందని నిపుణులు అంటున్నారు. కాజల్‌ని కళ్ల కు పట్టించాలంటే ఇంట్లోనే అలాంటి వాటిని తయారుచేసుకుని కంటి అందాన్ని పెంచుకోవాలని సూచిస్తున్నారు..


కెమికల్స్ వాడటం మంచిది కాదు.. మహిళలు కోల్‌ ఐ లైనర్‌ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఇది కళ్లకు హాని చేస్తుందని నిపుణులు అంటున్నారు. కాజల్‌ ని కళ్లకు పట్టించాలంటే ఇంట్లోనే అలాంటి వాటిని తయారు చేసుకుని కంటి అందాన్ని పెంచుకోవాలని సూచిస్తున్నారు. సరైన, మెరుగైన కంటి అలంకరణ చేసే వారు ఎల్లప్పుడూ వాటర్ లైన్‌ ను వదిలి మేకప్‌ ను ప్రారంభిస్తారు. కళ్ళలో ని ఈ ప్రాంతం లో చాలా గ్రంథులు ఉన్నాయి. ఇవి కళ్ళు తెరుచుకోవడం, ఇంకా ద్రవపదార్థాన్ని విడుదల చేయడంలో సహాయపడతాయి.


కను రెప్పల తో కంటి అలంకరణ చేయడం వల్ల అవి మూసుకుపోయే ప్రమాదం ఉంది. మీరు ఇన్ఫెక్షన్ బారిన పడకూడదనుకుంటే పొరపాటున కూడా ఇలా చెయ్యడం మంచిది కాదు..  చౌకైన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఇది కళ్ళలో చికాకు లేదా దురదను కలిగిస్తుంది. చర్మానికి హాని కలిగించే ఉత్పత్తులను ఎల్లప్పుడూ ఉపయోగించకండి. ఇటువంటి మేకప్ ఉత్పత్తులకు ఎంత దూరంగా వుంటే అంత మంచిది సుమీ.. ఒకవేళ ఏదైనా ఫంక్షన్‌కు వేసుకున్నా కూడా మంచి బ్రాండ్ వస్తువులు వేసుకోవడం మంచిది.. లేకుంటే కళ్ళకి దీర్ఘ కాలిక వ్యాధులు వస్తాయని నిపుణులు అంటున్నారు. అలాగే మేకప్  వేసిన తర్వాత కొద్ది గంటల్లో తీసి వెయ్యాలని అంటున్నారు. వీటిని తప్పక గుర్తుంచుకోండి... లేకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకైనా మంచిది దూరంగా వుంటే బెస్ట్..

మరింత సమాచారం తెలుసుకోండి: