పూర్వం వయసు మళ్ళిన వారిలో జీవక్రియారేటు తగ్గిపోయి  గుండె సమస్యలు వచ్చేవి. కానీ ఈ మధ్యకాలంలో చిన్న,పెద్ద తేడా లేకుండా, ఉన్నట్టుండి హార్ట్ స్ట్రోక్ గురవుతున్నారు.ఇప్పుడు అతి ఎక్కువగా వస్తున్న జబ్బులలో గుండె జబ్బు మొదటగా ఉందని చెప్పవచ్చు.దీనికి కారణం గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి, రక్తనాళాల గోడలు గట్టిపడటం వల్ల గుండెకు సక్రమంగా రక్తం సరఫరా జరగక,అధిక బ్లడ్ ప్రెజర్ పెరుగుతోంది. దీనితో హార్ట్ స్ట్రోక్స్ వస్తోంది.దీనిని నివారించడానికి కొన్ని ఆహారాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా అవిసెగింజలు అద్భుతంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మరి నిరూపించారు. ఈ గింజలలో ఆల్ఫా లెనోలినిక్ ఆసిడ్ మరియు ఒమేగాత్రీఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. అవిసెగింజలను రోజువారి ఆహారంలో  చేర్చుకోవడం వల్ల, ఇందులోని న్యూట్రియంట్స్ గుండె జబ్బులు రాకుండా నివారిస్తాయి. అంతేకాక అధిక బ్లడ్ ప్రెజర్ ని కూడా తగ్గిస్తుంది.ఇందులోని మంచికొవ్వులు గుండెఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇంత మేలు చేసే అవిసె గింజలను ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

 అవిసెగింజలను తీసుకొనే విధానం..

ఈ గింజలను నానబెట్టి తింటే చేదుగా అనిపిస్తాయి.కావున లడ్డుల్లా చేసుకొని, రోజుకొక లడ్డు భోజనం తర్వాత తీసుకుంటే చాలా మంచిది.దీనికోసం 100grms అవిసెగింజలను తీసుకొని,బాగా వేయించుకోవాలి. అందులోనే 10నుంచి 12 వరకు బాదాంలు,ఆరు పచ్చి ఖర్జురాలు తీసుకొని, విటన్నింటిని మీక్సీ పట్టి మెత్తగా, పేస్ట్ లాగా చేసుకోవాలి.ఇందులోనే నాల్గయిదు టేబుల్ స్ఫూనలా ఆవు నెయ్యి వేసి, లడ్డులా చుట్టుకొని, భద్రపరుచుకోవాలి. వీటిని ప్రతిరోజు భోజనం తర్వాత తింటే సరి.ఇవి రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.ఖర్జురాల్లోని ఐరన్ కంటెంట్ రక్తం పెరుగుదలకే కాక,రక్తం చిక్కబడకుండా చేస్తుంది.కావున ప్రతి ఒక్కరూ ఈ లడ్డును తినడం అలవాటు చేసుకోవడంతో పాటు, మంచి ఆహార అలవాట్లు, వ్యాయామం చేయడం వంటి వాటి ద్వారా గుండె సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: