మనకు అన్ని సీజన్లలో అందుబాటులో ఉండే పండ్లలో ఖచ్చితంగా దానిమ్మ పండ్లు కూడా ఒకటి. ఇవి చూసేందుకు ఎరుపు రంగులో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.అలాగే రుచిగా కూడా ఉంటాయి. అందుకే వీటిని చాలా మంది చాలా ఇష్టంగా తింటుంటారు. అయితే దానిమ్మ పండ్లను కొందరు తినేందుకు అస్సలు ఇష్టపడరు. కానీ వీటిని జ్యూస్‌లా చేసి తాగుతారు. దానిమ్మ పండ్లతో జ్యూస్‌ తయారు చేసి తాగితే దాంతో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ జ్యూస్‌ మనకు పోషకాలను ఇంకా శక్తిని కూడా అందిస్తుంది. దానిమ్మ పండ్ల జ్యూస్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా దానిమ్మ పండ్లను ఒలిచి పొట్టుని తీయాలి. తరువాత లోపల ఉండే గింజలను సేకరించాలి. ఆ తరువాత ఈ గింజలను జార్‌లో వేయాలి.ఆ తరువాత మిక్సీ పట్టి జ్యూస్‌ తీయాలి. ఇందులో రుచికి సరిపడా తేనె ఇంకా నిమ్మరసం వేసి కలపాలి. అలాగే కాసిన్ని చియా సీడ్స్‌ను కూడా వేయాలి.


తరువాత ఈ జ్యూస్‌ను ఫ్రిజ్‌లో పెట్టాలి. మూడు లేదా నాలుగు గంటల తరువాత చియా సీడ్స్‌ జెల్‌లా మారుతాయి. అప్పుడు మీరు జ్యూస్‌ను తాగవచ్చు. ఇలా దానిమ్మ పండ్ల జ్యూస్‌ను తయారు చేసి తాగితే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఇది చాలా ఆరోగ్యకరం కూడా. ఇలా దానిమ్మ పండ్లతో జ్యూస్‌ను తయారు చేసి రోజూ తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని రోజూ తీసుకుంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా అలాగే ఐరన్‌ బాగా లభిస్తుంది. దీంతో రక్తం ఎక్కువగా తయారవుతుంది. రక్తహీనత నుంచి ఈజీగా బయట పడవచ్చు. ఇంకా అలాగే ఈ పండ్లను తీసుకుంటే బీపీ, షుగర్‌ తగ్గుతాయి. గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. కొలెస్ట్రాల్‌ స్థాయిలు ఈజీగా తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. ఇలా దానిమ్మ పండ్లతో మనం చాలా లాభాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: