లో-గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ క్రమబద్ధీకరించడంలో సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారు తినడానికి ఇది మంచిది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి, రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి. గుండెకు మేలు చేసే ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైటోన్యూట్రియంట్స్ కలిగి ఉంటాయి. ఎముకల బలాన్ని పెంచుతాయి.కాల్షియం, మాగ్నీషియం, ఫాస్పరస్ అధికంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సహాయపడతాయి. శక్తిని పెంచుతాయి.నల్ల శనగలు నేచురల్ ఎనర్జీ బూస్టర్.రోజూ ఉదయాన్నే నానబెట్టిన నల్ల శనగలు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. హార్మోన్ల బ్యాలెన్స్‌ను మెరుగుపరుస్తాయి. మహిళలలో PCOS, మెనోపాజ్, నెలసరి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
పురుషులలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. చర్మ & జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బయోటిన్, విటమిన్ B6, ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. చర్మాన్ని తేమగా ఉంచి, యాంటీ-ఏజింగ్ ప్రభావాన్ని కలిగిస్తాయి. గర్భిణీలకు మరియు పిల్లలకు ఎంతో మేలు. ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల గర్భిణీల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పిల్లల ఎదుగుదలకు కావాల్సిన ప్రోటీన్, ఐరన్, కాల్షియం అందిస్తాయి. నానబెట్టిన నల్ల శనగలు – ఉదయాన్నే తినడం మంచిది. నల్ల శనగ సలాడ్ – ఉల్లిపాయ, టమాట, నిమ్మరసం కలిపి తినవచ్చు. నల్ల శనగ కూర – శనగలతో గ్రేవీ కూర చేసుకుని భోజనంలో తీసుకోవచ్చు. పౌడర్ చేసి మిశ్రమ ఆహారంగా – శనగల పొడిని గోధుమ పిండిలో కలిపి చపాతీలు చేసుకోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి