చీమలు చిన్నవి అయినా ఒకసారి ఇంట్లోకి వచ్చేసినప్పుడు వాటిని బయటకు పంపడం చిన్న పని కాదు. చల్లని పానీయం, మిఠాయి, పళ్ల చిప్పలు, షుగర్ లేదా తీపి పదార్థాల దగ్గర చీమలు వెంటనే కనిపిస్తాయి. ఇవి కేవలం ఇబ్బంది కలిగించడమే కాకుండా, ఆరోగ్యానికి హానికరమైన బ్యాక్టీరియా పంచుతాయి. మరి ఇంట్లో సహజమైన పదార్థాలతో చీమల సమస్యను ఎలా నియంత్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మరసాన్ని నీటిలో కలిపి స్ప్రే బాటిల్‌లో వేసి చీమలు వచ్చే ప్రాంతాల్లో స్ప్రే చేయాలి.

ముఖ్యంగా గుమ్మడి తలుపులు, కిచెన్ కార్నర్స్, ఫ్లోర్ మూలలు, గోడ పక్కల వంకల్లో చిమ్మాలి. ఎందుకు పనిచేస్తుంది: నిమ్మరసంలో ఉండే ఆమ్లత చీమల నాసిక గ్రంధులను మానేస్తుంది. దాంతో అవి మార్గాన్ని గుర్తించలేవు. సమపాళ్లలో వెనిగర్ మరియు నీటిని కలిపి స్ప్రే బాటిల్‌లో పెట్టాలి. చీమలు కనిపించే ప్రదేశాల్లో ప్రతిరోజూ ఒక్కసారైనా స్ప్రే చేయాలి. వెనిగర్ వాసన చీమల 'సెంటు ట్రయిల్' (సుగంధ మార్గం) ను మాయం చేస్తుంది. చీమలు దారితప్పిపోతాయి. చీమలు ఎక్కువగా వచ్చే మార్గాలలో, గోడల అంచుల్లో దాల్చిన చెక్క పొడి చల్లాలి.

వాసన బలంగా ఉండే పొడి మాత్రమే వాడాలి. ఇది చీమలకు సహించని వాసన. పుదీనా నూనె లేదా తులసి నూనె, కొన్ని బొట్లు తులసి లేదా పుదీనా నూనె + 1 కప్పు నీరు కలిపి స్ప్రే చేయాలి. ఇది చీమల దారులను అడ్డుకుంటుంది. బేకింగ్ సోడా + పంచదార,1 టీస్పూను బేకింగ్ సోడా + 1 టీస్పూను పంచదార కలిపి చిన్న గిన్నెలో పెట్టండి. చీమలు తీపి కోసం వస్తాయి, కానీ బేకింగ్ సోడా తినటం వల్ల అవి చనిపోతాయి. 1 టేబుల్ స్పూన్ బొరాక్స్ + 2 టేబుల్ స్పూన్లు పంచదార + తగినంత నీరు, చిన్న కాగితాల మీద లేదా బౌల్‌లో ఉంచాలి. బొరాక్స్ చీమల తాంత్రిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. చీమలు తినగానే చనిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: