ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన సరే ఆడవాళ్లు ఎక్కువగా నైటీలు వేసుకునే కనిపిస్తున్నారు. మరి ముఖ్యంగా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే కాదు కొంతమంది బయటకు వెళ్ళేటప్పుడు కూడా రకరకాల నైటీలు  వేసుకొని వెళ్లి పోతున్నారు.  పిల్లలను స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు.. కాయగూరలు కొనేటప్పుడు.. షాపింగ్ మాల్స్ కి వెళ్లేటప్పుడు మరీ ముఖ్యంగా కారులో ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్లేటప్పుడు .. రకరకాల నైటీల పేర్లతో అలాంటి నైటీలనే వేసుకొని ఓపెన్ గానే  రోడ్డుపై తిరిగేస్తున్నారు.  ఒకప్పుడు ఇది విచిత్రంగా అనిపించేది . రాను రాను అందరూ ఇదే పద్ధతి ఫాలో అవుతూ ఉండడంతో ఇది చాలా కామన్ గా తీసేసుకున్నారు.అడిగితే నైటీలో ఫ్రీగా ఉంటుంది మాకు కన్వీనెంట్గా ఉంటుంది అంటూ రకరకాల కారణాలు చెబుతున్నారు . మరీ ముఖ్యంగా కొంతమంది ఆడవాళ్లు నైటీ వేసుకుని ఇంట్లో పూజలు కూడా చేసేస్తూ ఉంటారు.  అయితే అలా పూజ కోసం నైటీ వేసుకోవడం మంచిదేనా ..? పూజ సమయంలో నైటీ వేసుకుంటే మనకి పుణ్యఫలం దక్కుతుందా..? లేదా..? అనే విషయాల గురించి ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!


హిందూ సంప్రదాయ ప్రకారం హిందూ మత ప్రకారం పూజ సమయంలో సాంప్రదాయదుస్తులను మాత్రమే ధరించడం ఒక ఆచారం . ఇది ఎప్పటినుంచో వస్తుంది . కేవలం పద్ధతిగా ఉన్న బట్టలు మాత్రమే వేసుకోవాలి . పూజ సమయంలో ఎక్కువగా ప్రకాశవంతమైన లేదా లేత రంగు బట్టలు ధరించడం చాలా చాలా ఉత్తమం అంటూ ఉంటారు పెద్దవాళ్లు.  నలుపు రంగు దుస్తులు ఎప్పుడు ధరించకూడదు అని కొందరు పండితులు చెబుతూ ఉంటారు.  పూజ చేసే సమయంలో ఎక్కువగా సంప్రదాయ దుస్తులను ధరించడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం పొందుతాం అనేది ఒక నమ్మకం . మహిళలు ఎక్కువగా చీరలు - సల్వార్ కమీజా లేకపోతే లంగా వోని ..పట్టు వస్త్రాలు .. పట్టు పావడాలు ఇలాంటివే ధరిస్తూ ఉంటారు.  పురుషులు ధోతి కుర్తాను ధరిస్తూ ఉంటారు . అయితే ఈ మధ్యకాలంలో ట్రెండ్ మారిపోయింది .


చాలామంది అమ్మాయిలు నైట్ డ్రెస్ అంటూ ప్యాంటు షర్టు.. పెళ్లి అయిన వాళ్ళు నైటీ అంటూ నైటీ కంఫర్టబుల్ అంటూ నైటీ వేసుకుని పూజలు చేసేస్తున్నారు.  ఇంట్లో శుక్రవారం అయితే చాలు ఆడవాళ్లు చీర కట్టుకొని కనిపించడం కన్నా కొత్త రకాల నైటీలు వేసుకొని కనిపిస్తూ దర్శనమిస్తున్నారు.  అయితే నైటీలు వేసుకొని పూజ చేయడం తప్పు అని ఎవరు చెప్పడం లేదు..?  అలా అని పూజకి నైటీలు వేసుకోవాలని కూడా ఎవరు చెప్పడం లేదు..? పూజ సమయంలో సాంప్రదాయ బద్ధంగా చీర కట్టుకొని పూజిస్తేనే మంచిది అని పురాణాలు శాస్త్ర ప్రకారం చెబుతున్నారు .


మరీ ముఖ్యంగా నైటీ అనేది కేవలం రాత్రిపూట మాత్రమే ధరించాలి . పూజ వంటి పవిత్ర కార్యక్రమాలలో అవి ఆమోదాయకంగా పరిగణించబడవు అని పెద్ద వాళ్ళు చెప్తున్నారు.  మనం పూజ చేసుకునేది మన ఇంటికి శుభం కలగాలని ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలి అని.. అలా పూజ చేసేటప్పుడు సాంప్రదాయ దుస్తులు కాకుండా ఇలా నైటీలు వేసుకొని కనిపించడం అంత మంచిది కాదు అంటున్నారు పెద్దవాళ్ళు.   నైటీ వేసుకుని పూజ చేసిన ఆ పుణ్యఫలం అస్సలు దక్కనే దక్కదు అంటున్నారు . కేవలం పూజ సమయంలో మాత్రమే కాదు ఆడవారు ఉదయం పూట కూడా నైటీలు వేసుకోవడం అంత మంచిది కాదు అని పెద్ద వాళ్ళు సూచిస్తున్నారు . రాత్రిపూట మాత్రమే నైటీ వేసుకోవాలి అని .. అందుకే దానికి నైటీ  అనే పేరు వచ్చింది అని దాన్ని మొత్తం మార్చేస్తుంది నేటి కాలం జనరేషన్ అంటూ మాట్లాడుతున్నారు . కొంతమంది అలా నైటీ వేసుకుని పూజ చేయడం వల్ల కూడా వాళ్లకి కలిసి రాదు అని .. మరీ ముఖ్యంగా పెళ్లయిన స్త్రీలు నైటీ వేసుకుని పూజ చేయడం వల్ల భర్త సంపాదన మొత్తం ఆవిరి అయిపోతుంది అని .. ఉద్యోగ పరంగా అదేవిధంగా ఇంటి ఎదుగుదల విషయంలో కూడా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు.


నోట్ : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: