
వేర్వేరు వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంలో బీట్ రూట్ తోడ్పడుతుంది. బీట్ రూట్‌లో ఉండే నైట్రేట్‌లు రక్త ప్రసరణను మెరుగుపరచడంతో ఎంతగానో ఉపయోగపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి బీట్ రూట్ రసం బెస్ట్ ఆప్షన్ అవుతుంది. బీట్‌రూట్‌లోని నైట్రేట్‌లు కండరాలకు ఎక్కువ ఆక్సిజన్ అందేలా మేలు చేస్తాయి.
బీట్ రూట్‌లో ఉండే పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు మెమొరీ పవర్ ను పెంచుతాయి. బీట్‌రూట్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బీట్‌రూట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఇతర సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో తోడ్పడతాయి.
బీట్ రూట్ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంతో పాటు మొటిమలు, చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. రక్తహీనతతో బాధ పడేవాళ్ళు బీట్ రూట్ ను తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లకు బీట్ రూట్ మంచి ఆప్షన్ కాదు. ఇది కిడ్నీలో రాళ్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపయోగపడుతుంది. అలెర్జీ ఉన్నవాళ్లు సైతం బీట్ రూట్ కు దూరంగా ఉండాలి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు