భుజం నొప్పి అనేది చాలామందిని బాధించే ఒక సాధారణ సమస్య. ఇది వయస్సుతో సంబంధం లేకుండా వచ్చినా, ఎక్కువగా కంప్యూటర్ వాడకం, భరంగా పనిచేయడం, పొరపాటుగా పడుకోవడం, గాయం, నడక తీరు, నరాల ఒత్తిడి వంటి కారణాల వల్ల కలుగుతుంది. సాధారణంగా ఇది మానసిక ఒత్తిడి, నిద్రలేమి, సరైన కండరాల వ్యాయామం లేకపోవడం వంటివి కూడా ప్రభావితం చేస్తాయి. ఓ షాల్ లేదా గుడ్డలో వేడి నీటిని నానబెట్టి భుజంపై వేయండి. లేదా హాట్ వాటర్ బ్యాగ్ ఉపయోగించవచ్చు. ఇది కండరాల్లోని గట్టితనాన్ని తగ్గిస్తుంది, రక్త ప్రసరణ మెరుగవుతుంది. రోజుకు 2–3సార్లు 15 నిమిషాల పాటు వేయండి. మెంతిని వేయించి పొడిచేసి, వేడి నీటిలో కలిపి పేస్ట్ చేయాలి.

ఈ పేస్ట్‌ను నొప్పి ఉన్న భుజం మీద అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడగాలి. ఇది వాపు, నొప్పిని తగ్గిస్తుంది. సున్నపిండిని వేడి చేసి కొద్దిగా నూనె కలిపి మసాజ్ చేయండి. ఇది నరాల బలహీనత తగ్గిస్తుంది. అంతేకాకుండా వాపు, గడ్డకట్టిన నొప్పికి బాగా పనిచేస్తుంది. అల్లాలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల వాపు, నొప్పిని తగ్గిస్తుంది. అల్లం, తులసి, మిరియాలు, తేనెతో కషాయం చేసుకుని రోజుకు ఒక్కసారి తాగడం మంచిది. నిమ్మరసంలో ఉప్పు కలిపి దానితో భుజంపై మృదువుగా మసాజ్ చేయండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, నరాలకు తేలిక కలుగుతుంది. ఫ్రెష్ కలబంద గుజ్జును భుజం మీద అప్లై చేయండి.

ఇది చల్లదనం ఇస్తుంది, ముసిలు కండరాల వాపును తగ్గిస్తుంది. ఒక చేతితో టేబుల్/చెయిర్ పట్టుకుని, మరొక చేతిని ముందుకు, వెనుకకు, సైడ్ వైపు ఊపండి. ఇది ఫ్రోజన్ షోల్డర్ సమస్యకు మంచి వ్యాయామం. గోడపై మీ చేతిని పైకి వాకింగ్ లా ఉంచుతూ పైకి తీసుకెళ్లండి. నొప్పి లెవెల్‌కు మించి లేవకూడదు. ఇది మెల్లగా కదలికలు మెరుగుపరుస్తుంది. ఒక చేతిని మరొక చేతి సహాయంతో వ్యతిరేక భుజం మీదకు తిప్పి స్ట్రెచ్ చేయండి. ఈ వ్యాయామాలను రోజూ 10–15 నిమిషాలు చేసుకుంటే ఫలితం కనిపిస్తుంది. వాపు తగ్గించే ఆహారాలు: అల్లం, మెంతులు, వెల్లుల్లి, తులసి, పుదీనా, ఎండు ద్రాక్ష. విటమిన్ D, కాల్షియం ఉండే ఆహారాలు: పాల ఉత్పత్తులు, ఎండు మునగ ఆకులు, సూర్యప్రకాశం.రోజుకు 2.5–3 లీటర్ల నీరు తాగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: