మధుమేహం అనేది శరీరంలో ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం వల్ల వచ్చే వ్యాధి. దీనిని నియంత్రించడంలో ఆహారం, మందులు, జీవనశైలి మార్పులతో పాటు యోగాసనాలు కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి రోజు కొన్ని ప్రత్యేక యోగాసనాలు చేయడం ద్వారా బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలోకి రావటమే కాదు, ఇన్సులిన్ పనితీరు మెరుగవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, శరీరం చురుగ్గా మారుతుంది. మెట్లపై బాగా పడుకోండి. కాళ్లను మడిచి, మోకాళ్లను ఛాతీ వైపు తేవాలి. చేతులతో మోకాళ్లను పట్టుకుని మోకాళ్లు ఛాతీకి తాకేలా తిప్పాలి. తలకూడా లేపి మోకాళ్లపై ఉంచాలి. 20 సెకండ్లు ఉంచి శ్వాస తీసుకుంటూ వెనక్కి రావాలి.

పొట్టపై ఒత్తిడి పెంచి ప్యాంక్రియాస్ పనితీరును మెరుగుపరుస్తుంది. గ్యాస్, అజీర్ణం, షుగర్ నియంత్రణలో సహాయపడుతుంది. పొత్తికడుపుపై పడుకొని, కాళ్లను మడిచి చేతులతో పాదాలను పట్టుకోండి. పాదాలను పైకి లేపుతూ ఛాతీను కూడా పైకి తీయండి. బాణంలా ఆకృతి ఏర్పడుతుంది. 15–30 సెకండ్లు ఉంచండి. ప్యాంక్రియాస్‌ను ఉత్తేజింపజేసి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. చక్కెర స్థాయిని స్తిరంగా ఉంచుతుంది. అర్ధమత్స్యేంద్రాసనం, కూర్చుని ఒక కాలి మడిచిన మోకాలి మీద మరొక కాలిని ఉంచి, వెనక్కి తిరగాలి. వృత్తంగా తిరుగుతూ స్పైన్‌ను తిప్పాలి.

చేతులతో మోకాళ్ళను పట్టుకోవచ్చు. 15 సెకండ్ల పాటు ఉంచి మళ్లీ నేరుగా కూర్చోవాలి. కడుపులోని అవయవాలకు మసాజ్ లా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇన్సులిన్ విడుదలకు సహాయపడుతుంది. వజ్రాసనం, భోజనం తర్వాత కనీసం 5–10 నిమిషాలు రెండు కాళ్లను మడిచిన స్థితిలో కూర్చోవాలి. వెన్నెముక నేరుగా ఉంచాలి. భోజనం తర్వాత బ్లడ్ షుగర్ పెరగకుండా నియంత్రిస్తుంది. జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. శక్తి, ఓపిక పెరుగుతుంది. భుజంగాసనం,  పొత్తికడుపుపై పడుకొని, చేతులతో నేలపై ఒత్తి ఛాతీ భాగాన్ని పైకి లేపాలి. తల వెనక్కి వంచాలి. 15–20 సెకండ్లు ఉంచి మళ్లీ మామూలు స్థితికి రావాలి. ప్యాంక్రియాస్, కిడ్నీలు, లివర్ పైన ప్రభావం చూపిస్తుంది. బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: