
వాల్‌నట్, బాదం, అవిసె గింజలు, నువ్వులు — ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అందిస్తాయి. ఒట్స్, బ్రౌన్ రైస్, గోధుమలు — మంచి కార్బోహైడ్రేట్లు, ఫైబర్ అందిస్తుంది. ఫ్రై ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్చె డు కొవ్వు పెంచుతాయి. అధిక ఉప్పు → బీపీ పెరుగుతుంది → గుండె దెబ్బతింటుంది. అధిక చక్కెర → షుగర్, బరువు పెరుగుదల → గుండె పాడవుతుంది. గుండెకు మంచి రక్తప్రసరణ ఉండాలంటే తగినంత నీరు అవసరం. రోజుకు కనీసం 3–4 లీటర్లు గోరువెచ్చటి నీరు తాగండి. ఒత్తిడి గుండె వ్యాధులకు ప్రధాన కారణం. ధ్యానం, ప్రాణాయామం, సాంగ్స్ వినడం, నడక వంటి ప్రక్రియలు ఒత్తిడిని తగ్గిస్తాయి.
నిద్ర తక్కువైతే గుండె పనిచేయడంలో సమతుల్యత కోల్పోతుంది. రోజుకు 7–8 గంటలు నిద్ర తప్పనిసరి. హై బీపీ, డయాబెటిస్ ఉన్నవారిలో గుండె సమస్యలు ఎక్కువ. తరచూ పరీక్షలు చేయించుకొని కంట్రోల్ లో ఉంచాలి. అర్లీ స్టేజ్ లో సమస్యలు గుర్తిస్తే నివారించవచ్చు. ఇవి రక్తనాళాలు కట్టడించడంతో గుండెకు తీవ్రమైన సమస్యలు వస్తాయి. బరువు తగ్గేందుకు రోజూ వాకింగ్, తక్కువ కాలరీలు తీసుకునే ఆహారం అవసరం. వెల్లుల్లి – రక్త నాళాలు విస్తరించేందుకు సహాయం చేస్తుంది. ఉసిరికాయ – యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ C, భోజనానికి ముందు మరియు తరువాత చిన్న నడక చేసుకోవడం.