పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో కొవ్వూరు ఒకటి...ఇక్కడ మొదట నుంచి టీడీపీ సత్తా చాటుతూనే వస్తుంది. 1983 నుంచి చూసుకుంటే..2019 వరకు కొవ్వూరులో టీడీపీ 7 సార్లు విజయం సాధించింది. ఒక 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా, ఇక 2019 ఎన్నికల్లో ఇక్కడ మొదటిసారి వైసీపీ విజయం సాధించింది. వైసీపీ తరుపున తానేటి వనిత పోటీ చేసి విజయం సాధించారు.


అయితే వనిత రాజకీయ జీవితం మొదలైంది టీడీపీలోనే...2009 ఎన్నికల్లో గోపాలాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కానీ ఆ తర్వాత ఆమె టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున కొవ్వూరులో పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో మరొకసారి పోటీ చేసి విజయం సాధించారు. దాదాపు 25 వేల ఓట్ల మెజారిటీతో వనిత టీడీపీపై విజయం సాధించారు.


అలాగే వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో, జగన్ క్యాబినెట్‌లో చోటు కూడా దక్కింది. జగన్ క్యాబినెట్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇక మంత్రిగా వనిత ఎలా పనిచేస్తున్నారో...పూర్తిగా ఎవరికి క్లారిటీ లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ రెండున్నర ఏళ్లలో వనిత పెద్దగా హైలైట్ అయిన సందర్భాలు కూడా లేవనే చెప్పాలి. అసలు వనిత మంత్రి అనే విషయం కూడా పెద్దగా హైలైట్ కాలేదు. అంటే ఆమె పని తీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.


మంత్రిగా పక్కనబెడితే...ఎమ్మెల్యేగా కొవ్వూరులో ఎలా పనిచేస్తున్నారనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే..మామూలుగా ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో వనిత పనితీరు కూడా అలాగే ఉందని తెలుస్తోంది. ఒక మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గంలో అనుకున్న మేర అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నారని తెలుస్తోంది. ఇక్కడేమన్న ప్లస్ ఉందంటే...అది ప్రభుత్వ పథకాలు మాత్రమే..అలాగే ప్రభుత్వం తరుపున జరిగే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు.


ఇక్కడ రోడ్ల పరిస్తితి మరీ దారుణంగా ఉంది. కొవ్వూరు మున్సిపాలిటీలో స్వచ్చమైన తాగునీరు అందడం కష్టం...అలాగే డ్రైనేజ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇటు నియోజకవర్గంలో వైసీపీ నేతల అక్రమాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి...ఇసుక, ఇళ్ల స్థలాల్లో ఎలాంటి అక్రమాలు జరిగాయో చెప్పాల్సిన పని లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీలో గ్రూప్ తగాదాలు ఉన్నాయి. మాజీ మంత్రి జవహర్ వర్గం...వేరే వర్గానికి అసలు పడదు. కొవ్వూరు సీటు జవహర్‌కు రాకూడదని వేరే వర్గం గట్టిగానే ట్రై చేస్తుంది. ఇటు సీటు దక్కించుకోవాలని జవహర్ ప్రయత్నిస్తున్నారు. కాకపోతే వైసీపీకి ఇక్కడ ప్లస్ ఎక్కువ లేదు కాబట్టి, టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: