ఇటీవల కాలంలో చాలామంది ఉద్యోగానికంటే వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే టిష్యూ పేపర్ వ్యాపారం మీరు ప్రారంభించవచ్చు. అన్ని సీజన్లో వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా దీనిని ప్రారంభించవచ్చు. ఒకవేళ పెట్టుబడికి మీ దగ్గర డబ్బులు లేకపోతే ప్రభుత్వం కూడా మీకు సహాయం చేస్తుంది. టిష్యూ పేపర్ యూనిట్ ద్వారా భారీ మొత్తంలో మీకు లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి ? లాభాలు ఏ విధంగా వస్తాయి? అనేది ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

ప్రస్తుతం టిష్యూ పేపర్ వాడకం బాగా పెరిగింది.  చేతులు, నోటిని మాత్రమే శుభ్రం చేయడానికి టిష్యూ పేపర్ను ఉపయోగిస్తారు.  ఈ రోజుల్లో రెస్టారెంట్, హోటల్, ఆఫీస్, హాస్పిటల్,  ధాబా ఇలా దాదాపు అన్ని చోట్ల ఈ టిష్యూ పేపర్లను వాడుతున్నారు.  అందుకే వీటికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.  మీరు నేరుగా హోటల్స్,  హాస్పిటల్స్, ఆఫీస్ లతో మాట్లాడి టిష్యూ పేపర్ సరఫరా చేయవచ్చు.  లేదంటే సూపర్ మార్కెట్ ద్వారా కూడా అమ్ముకోవచ్చు.  ఇక ఆన్లైన్ వేదికగా విక్రయాలు జరిపినా సరే మీకు మంచి లాభం వస్తుంది. మీరు తయారు చేసే ఏ ఉత్పత్తి అయినా సరే మార్కెటింగ్ తప్పనిసరి.. మార్కెటింగ్లో అవగాహన ఉంటే కచ్చితంగా మీ ఆదాయం రెట్టింపు అవుతుంది.

ఈ వ్యాపారం మొదలు పెట్టడానికి మీ దగ్గర 3.5 లక్షల రూపాయలు ఉంటే సరిపోతుంది . లేదు మీ దగ్గర ఇంత డబ్బు లేకపోతే ప్రభుత్వం లో ముద్ర పథకం కింద లోన్ తీసుకోవచ్చు. 1.50లక్షల కిలోల పేపర్ నాప్కిన్లను ఉత్పత్తి చేయవచ్చు.  కిలో టిష్యూ పేపర్ 65 రూపాయల చొప్పున మార్కెట్లో విక్రయించినా మీకు ఏడాదికి దాదాపు రూ. 97.5 లక్షల టర్నోవర్ చేయవచ్చు.  ఎటు చూసినా మీకు ప్రతి సంవత్సరం 10 -12 లక్షల రూపాయల ఆదాయం మిగులుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: