అంబానీ కుటుంబానికి చెందిన విలాసవంతమైన జీవనశైలి ఎప్పుడు సామాన్య ప్రజలను అబ్బురపరుస్తూ.. ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. రోజువారి జీవితంలో వారు పెట్టే ఖర్చు గురించి తెలిసి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇలా గత కొంతకాలం నుంచి ముఖేష్ అంబానీ భార్య ప్రముఖ సామాజికవేత అయిన నీత అంబానీ ఎంత కాస్లి లైఫ్ ను లీడ్ చేస్తారు అన్న వార్త కాస్త సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధారణంగా సామాన్యులు సైతం ప్రతిరోజు ఉదయాన్నే టీ లేదా కాఫీతో ప్రారంభిస్తూ ఉంటారు.



 అపర కుబేరుడు భార్య నీత అంబానీ సైతం ఇలా తన ఉదయాన్ని టీ తోనే ప్రారంభిస్తూ ఉంటుందట. అయితే ఆమె తాగే టీ కి సామాన్యుడు తాగే టీ కీ తేడా ఏంటో తెలుసా.. కేవలం కప్ మాత్రమే. ఎందుకంటే అత్యంత ఖరీదైన టీ కప్పులో నీతా అంబానీ  టీ తాగుతూ ఉంటుందట. జపాన్లో తయారుచేసిన ఈ టీ కప్పు సెట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విలాసవంతమైన టీ సెట్ గా ప్రసిద్ధిగాంచింది. ఇంతకీ నీత అంబానీ టీ తాగే కప్పు ధర తెలిస్తే మాత్రం ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఏకంగా ప్రతిరోజు ఉదయం నీత అంబానీ టీ తాగే కప్పు ధర మూడు లక్షల వరకు ఉంటుందట.



 ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ టీ కప్పులొ టీ తాగుతూ నీత అంబానీ తన రోజు ప్రారంభిస్తూ ఉంటుందట. జపాన్ కు చెందిన పురాతన క్రోకరి కంపెనీ నోరిటేక్ ఈ టీ కప్పుల తయారు చేస్తూ ఉంటుందట. ఈ టీ సెట్ లో ఒక్కొక్కటి మూడు లక్షల పైగానే ఉంటుంది. మొత్తం టీ సెట్ ధర దాదాపు 1 5 కోట్లకు పైగానే ఉంటుంది అన్నది తెలుస్తుంది. ఇక ఈ సెట్ లోని టీ కప్పు ప్రపంచంలోనే అత్యుత్తమ చైనా మట్టితో తయారు చేస్తారట. ఇక వీటి అలంకారం కోసం ప్లాటినంతో పూత, బంగారంతో డిజైన్ చేయడం చేస్తూ ఉంటారట. ఏది ఏమైనా ఇలాంటి టీ కప్ గురించి తెలిసి ప్రతి ఒక్కరు షాక్ ఆవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: