ప్రముఖ సినీ నటుడు నితిన్ చర్లపల్లి సెంట్రల్ జైల్లో సందడి చేశాడు. నితిన్ చర్లపల్లి జైలుకెందుకెళ్లాడన్న అనుమానం వచ్చిందా..? హీరో ఏంటీ.. జైలుకు వెళ్లడం ఏంటని కంగారు అక్కర్లేదండీ. ఎందుకంటే ఓ మూవీ షూటింగ్‌లో భాగంగా నితిన్ చంచల్‌గూడ జైలులో కొన్ని గంటలు గడిపాడు. 'అ...ఆ' సినిమా తరువాత 14 రీల్స్ బ్యానర్ పై హను రాఘవపూడి (కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ఫేం) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ కోసం నితిన్ చర్లపల్లి జైలుకు వచ్చాడు.


చంచల్‌గూడ జైల్లో యంగ్ హీరో!

దీంతో ఒక్కసారిగా జైలు ప్రాంగణంలో కొద్దిసేపు సందడి వాతావరణం నెలకొంది. నటులు పృధ్వీ, బ్రహ్మాజీ, హీరో నితిన్‌లపై జైలు లోపల కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అ..ఆ.. సినిమాతో రూ.50 కోట్ల క్లబ్లో చేరిన నితిన్ కొంత విరామం తర్వాత చేస్తున్న ఈ మూవీ షూటింగ్‌ గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది. దీనికి సంబంధించిన సీన్లు చిత్రీకరించాల్సి వస్తే... మరోసారి చర్లపల్లి జైలుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని దర్శకుడు తెలిపాడు. 


చంచల్‌గూడ జైల్లో యంగ్ హీరో!

ఓల్డ్ సిటీ కుర్రాడిగా కనిపించేందుకు భారీగా గడ్డం పెంచేసి రఫ్ లుక్లో కనిపిస్తున్నాడు నితిన్. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీలో సీనియర్ నటుడు అర్జున్‌ స్టైలిష్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: