ఇలా వచ్చిందో లేదో అలా యూత్ గుండెల్లోకెళ్ళి కూర్చుంది. హాట్ హాట్ అందాలతో నిద్ర లేకుండా చేస్తోంది. గ్లామర్ తో పాటు యాక్షన్ మిక్స్ చేసి అహా అనిపించేస్తోంది.  ఈ చిన్నది చలో అంటే కుర్రకారు పోలో మంటోంది. లేటెస్ట్ హిట్ గీతా గోవిందం తో అంతా గీతా పారాయణ చేస్తున్నారు. ఆ బ్యూటీ క్వీన్ రష్మిక మండన్నా... టాలీవుడ్ సరికొత్త అందం



రెండో మూవీతోనే టాప్ లేపేస్తోంది రష్మిక. తెలుగులో ఆమె డెబ్యూ  ఫిల్మ్ చలో. ఇందులో నాగ శౌర్యతో జట్టు కట్టి తన చలాకీ  అంతా చూపించింది. రొమాంటిక్ సీన్లతో కెవ్వు కేక పెట్టించింది. ఆ సినిమా ఇలా హిట్ అయిందో లేదో బిగ్ మూవీ హౌస్ గీతా అర్ట్స్ నుంచి లక్కీ చాన్స్ వచ్చింది. అదే గీతా గోవిందం. అందులో విజయ్ దేవరకొండ పక్కన సూపర్ గా యాక్ట్ చేసేసి టాప్ హీరోయిన్స్ కే సవాల్ చేస్తోంది.



నాగ్ దేవదాస్ లో ఆమె ఇపుడు  నటిస్తోంది. అలాగే మరో రెండు మూవీస్ లో విజయ్ పక్కన, నాని పక్కన చాన్స్ కొట్టేసింది. 2016లో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి తెరంగ్రేట్రం చేసిన రష్మిక మాంచి  జోరు మీద ఉంది. కన్నడ కంటే తెలుగులోనే ఎక్కువ అవకాశాలు సొంతం చేసుకున్న ఈ అమ్మడు టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేయడం ఖాయంగా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: