నాగార్జున, నాని, సినిమాటోగ్రఫీ, బిజిఎంనాగార్జున, నాని, సినిమాటోగ్రఫీ, బిజిఎంస్టోరీ, ఊహించే కథనం

దాసు (నాని) ఓ అమాయకమైన వ్యక్తి. డాక్టర్ అయిన దాసు తనకు తానుగా ఎవరికి హాని కలిగించని వ్యక్తిత్వం కలవాడు. ఇక మరో పక్క అతని జీవితంలోకి అనుకోకుండా డాన్ అయిన దేవా (నాగార్జున) వస్తాడు. గాయాలతో వచ్చిన దేవాని డాక్టర్ గా కాపాడగా దేవ.. దాస్ ఇద్దరు తెలియకుండానే ఒకరంటే ఒకరు స్నేహితులవుతారు. ఈ క్రమంలో డాన్ అయిన దేవా తను చేసిన పనుల వల్ల పోలీసులు అతను సిటీలోకి వచ్చాడని చెప్పి వెతుకుతుంటారు. ఇక మరో పక్క దేవా కోసం వెతికే డేవిడ్ గ్యాంగ్ కూడా అతని కోసం వెతుకుతుంది. అయితే దేవ.. దాసుల మధ్య స్నేహం దేవాని మార్చేస్తుంది. అదెలా తన మీద పడిన ముద్ర చెరిపేసేందుకు దేవా ఏం చేశాడు అన్నది సినిమా కథ.   

దేవాగా నాగార్జున అదరగొట్టారు. సినిమాకు ఆయన పాత్ర చాలా ప్రాధాన్యమని చెప్పొచ్చు. ఇక మరోపక్క నాని దాసు పాత్ర చాలా అమాయకంగా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. స్క్రీన్ మీద నాగ్, నానిల కాంబినేషన్ బాగుంది. ఇక హీరోయిన్స్ రష్మిక, ఆకాంక్ష సింగ్ ఇద్దరు బాగా చేశారు. నరేష్, మురళి శర్మ పాత్రలు అలరించాయి. వెన్నెల కిశోర్, వేణు ఉన్నా పెద్దగా కామెడీ పండలేదు.

శాందత్ సాయినుద్దీన్ సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. నాగార్జున లుక్స్ పరంగా అదరగొట్టాడు.. నాని కూడా బాగానే ఉన్నాడు. ఇక మణిశర్మ మ్యూజిక్ ఇంప్రెసివ్ గా ఉంది. రెండు సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎంత బడ్జెట్ కావాలో అంత కేటాయించారు.

భలే మంచి రోజు, శమంతకమణి సినిమాలతో దర్శకుడు శ్రీరాం ఆదిత్య ప్రతిభ ప్రేక్షకులకు తెలిసింది. అనుకున్న కథని అనుకున్న విధంగా తెరకెక్కించడంలో అతను సక్సెస్ అయ్యాడు. దేవదాస్ విషయంలో స్క్రీన్ ప్లే బాగా కుదిరింది. అయితే కథ ఏమంత కిక్ ఇవ్వదు కాని కథనం బాగుంటుంది. ముఖ్యంగా నాగార్జున, నానిల పాత్ర స్వభావాలు.. స్క్రీన్ మీద వారు చేసే అల్లరి బాగుంటుంది.

ఇద్దరు ఇద్దరి పాత్రలకు న్యాయం చేశాడు. ఏరా గోల్డ్ అని నానిని పిలిచిన నాగార్జున మెప్పిస్తాడు.. ఇద్దరు ఏజ్ డిఫరెన్స్ కనిపించకుండా చక్కగా కలిసి నటించారు. ఇక కథలో మేజిక్ ఏమి లేదు కాబట్టి సినిమా చూసిన ఆడియెన్స్ ఓకే అనిపిస్తుంది. కథ మీద ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేదనిపిస్తుంది.

మల్టీస్టారర్ సినిమాకు కావాల్సిన అన్ని హంగులు ఈ సినిమాలో ఉన్నాయి. కామెడీ ఎంటర్టైనర్ గా సినిమా యూత్, ఫ్యామిలీ అని తేడా లేకుండా అందరిని అలరిస్తుందని చెప్పొచ్చు. 


Akkineni Nagarjuna,Nani,Rashmika,Aakansha Singh,Sriram Aditya,Ashwini Dutt,Manisharmaనాగార్జున, నాని దేవదాస్.. ఎంటర్టైన్ చేశారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: