ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను    ప్రముఖ హీరో గోపీచంద్ తన సోషల్ మీడియా 'ట్విట్టర్' ఖాతా ద్వారా విడుదల చేసి చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో అశ్విన్, దర్శకుడు ప్రతాప్ తాతంశెట్టి, నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు లు పాల్గొన్నారు.


 హీరో గోపీచంద్  మాట్లాడుతూ...'అనగనగ ఓ ప్రేమకథ' చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఎంతో ప్రామిసింగ్ గా ఉంది. చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు గారు పరిశ్రమలోని అందరికీ కావలసిన వ్యక్తి. ఆయన  చేసిన ఈ ప్రయత్నం మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను అన్నారు. మార్తాండ్.కె.వెంకటేష్ గారు నాకు అన్న లాంటి వారు. ఆయన అక్క కొడుకు అశ్విన్. ఈ చిత్ర హీరో. సన్నివేశాలలో గానీ, సంభాషణలు పలకటం లోగానీ, పోరాటాలలో గానీ అశ్విన్ మంచి ప్రతిభ కనబరిచారు. ఇదే అతని తొలి చిత్రం అనిపించటం లేదు. అంతలా నటించాడు. మంచి హీరో అవ్వాలని అభినందిస్తున్నాను. చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని, ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు. 


తమ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను గోపీచంద్ గారు  విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు.ఆయన మాట్లాడుతూ..' ఈ చిత్రం టీజర్ ను ప్రముఖ హీరో రాణా విడుదల చేశారు. అలాగే చిత్రంలోని గీతాలను  ప్రముఖ దర్శకులు మణిరత్నం, పూరి జగన్నాధ్, శేఖరకమ్ముల, పరశురామ్ లు విడుదల చేశారు. ఇంతమంది విజయవంతమైన చిత్రాల దర్శకులు విడుదల చేయటం, ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు.  ఈ చిత్రం హైదరాబాద్, అరకు, విశాఖపట్నం , మలేసియా లలోని పలు లొకేషన్ లలో చిత్రీకరణ జరుపుకుంది. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. త్వరలోనే చిత్రం  విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత  తెలిపారు.


హీరో విరాజ్.జె .అశ్విన్ మాట్లాడుతూ...' అన్నయ్య గోపీచంద్ చిత్రాలు చూసి పెరిగాను. ఈ రోజు నేను హీరోగా నటించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను గోపీచంద్ గారు విడుదల చేయటం ఎంతో సంతోషంగా ఉందని అంటూ ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు. విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతుండగా  'అనగనగా ఓ ప్రేమకథ'  పేరుతో ఈ చిత్రం నిర్మితమవుతోంది. కె.సతీష్ కుమార్ సమర్పణలో  ప్రతాప్ తాతంశెట్టి   దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్ ,రాధా బంగారు నటిస్తున్నారు.  సినిమా రంగంలో ప్రముఖ  ఫైనాన్షియర్ గా పేరుపొందిన  నిర్మాత  కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ 
నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు, కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి 


మరింత సమాచారం తెలుసుకోండి: