జ‌య‌ప్ర‌ద‌,  పూర్ణ,  సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం “సువర్ణసుందరి“.   సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకువస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న క్యాప్షన్ తో    భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని  రీతిలొ ఓ  సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న  ఈ చిత్రం మే 31న‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇటీవలె‌ విడుదలైన థియేట్రిక‌ల్‌ ట్రైలర్ కు మిలియన్ వ్యూస్ లభించాయి.
 
ఈ సందర్బంగా విలేక‌రుల స‌మావేశంలో ....
కెమెరామెన్ ఈశ్వ‌ర్ మాట్లాడుతూ...ఈ 31కి సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. కొంచం లేట‌యినా మంచి అవుట్‌పుట్‌తో వ‌స్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్ర‌స్తుతం ఈ సినిమా ఇప్పుడు విడుద‌ల‌వ‌డం క‌రెక్ట్ టైమ్‌. అంద‌రూ ఈ సినిమాని చూసి త‌ప్ప‌కుండా ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


ప్రొడ్యూస‌ర్ ల‌క్ష్మీ మాట్లాడుతూ... మా సినిమాకి మొద‌టి నుంచి కూడా మీడియా చాలా స‌పోర్ట్ చేసింది. మీ స‌పోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాల‌ని కోరుకుంటున్నాను. ఈ నెల 31వ తేదీన తెలుగు, క‌న్న‌డ‌లో విడుద‌ల‌వుతుంది. గ‌తంలో విడుద‌లైన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  ఈరోజు విడుద‌లైన మ‌రో ట్రైల‌ర్‌ని కూడా అదే విధంగా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి మేము అనుకున్న బ‌డ్జెట్ కంటే ఎక్కువ‌గానే ఖర్చు అయింది. అయినా అవుట్ పుట్ చాలాబాగా వ‌చ్చింది. 


డైరెక్ట‌ర్ ఎం.ఎస్.ఎన్‌. సూర్య మాట్లాడుతూ... ఒక డైరెక్ట‌ర్‌గా నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఆల్రెడీ రిలీజ్ చేసిన మా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ముందులో అంద‌రూ న‌న్ను ప్రొడ్యూస‌ర్‌తో కాస్త ఎక్కువ ఖ‌ర్చుపెట్టించావ్ అన్నారు. కాని స్టోరీ అలా డిమాండ్ చేసింది. అరుంధ‌తి, మ‌గ‌ధీర టైప్‌లో ఉంటుంది. ఈ మూవీలో కామెడీ లేదు ఎవ్వ‌రూ కామెడీని ఎక్స్‌పెక్ట్ చెయ్యోద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ రోజు విడుద‌లైన మ‌రో ట్రైల‌ర్‌ను కూడా ఇంత‌కు ముందులానే ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను. స్టోరీ లైన్ వ‌చ్చేసి ఆరువంద‌ల సంవ‌త్స‌రాల క్రితం ఒక‌రాజు చేసిన త‌ప్పిదం వ‌ల్ల త‌ర‌త‌రాల వాళ్ళ‌ను వెంటాడే క‌థ ఇది. ఇందులో జ‌య‌ప్ర‌ద‌, పూర్ణ‌, సాక్షి అంద‌రి పార‌త‌లు కీల‌క‌మైన‌వే. అని అన్నారు.
ఫైట్‌మాస్ట‌ర్ రామ్ సుంక‌ర మాట్లాడుతూ... మ‌రో కొత్త ట్రైల‌ర్‌తో ట్రెండీగా, మాసివ్‌గా మిమ్మ‌ల్ని ఆక‌ట్టుకుంటుంది. ఇంత లేట్ అవ‌డానికి కార‌ణం క్వాలిటీ కోసం వెయిట్ చేశాం. మీకు సినిమా చూస్తే అర్ధ‌మ‌వుతుంది. ఇన్నిరోజులు వెయిట్ చేసినందుకు  అర్ధ‌ముందని అనిపిస్తుంది. మీరంద‌రూ త‌ప్ప‌కుండా ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


జ‌య‌ప్ర‌ద‌, పూర్ణ‌, సాక్షి, ఇంద్ర‌, రామ్, సాయికుమార్‌, కోటాశ్రీ‌నివాస‌రావు, ముక్త‌ర్‌ఖాన్‌, నాగినీడు, స‌త్య‌ప్ర‌కాష్‌, అవినాష్ న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ్యూస‌ర్ఃఎం.ఎల్‌.ల‌క్ష్మి, మ్యూజిక్‌డైరెక్ట‌ర్ఃసాయికార్తిక్‌, స్టంట్స్ఃరామ్‌సుంక‌ర‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ఃనాగు, డి.ఓ.పి. ఎల్లుమహంతి, ఎడిట‌ర్ఃప్ర‌వీణ్‌పూడి, స్టోరీఃఎం.ఎస్‌.ఎన్.సూర్య‌, పి.ఆర్‌.ఓ. సాయిస‌తీష్‌, డైరెక్ట‌ర్ఃఎం.ఎస్‌.ఎన్‌.సూర్య‌.


మరింత సమాచారం తెలుసుకోండి: