మొన్నటి వరకు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని శాసించిన వ్యక్తులు ఎవరు అంటే ఖాన్ త్రయం అని చెప్తారు.  ఖాన్ త్రయం సినిమా ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేశారు.  బాలీవుడ్ లో మాక్సిమం హిట్స్ వాళ్ళ ఖాతాలోనే ఉన్నాయి.  అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్లదే హవా.  


ఇప్పుడు యంగ్ హీరోలు వస్తున్నారు.  వాళ్ళ సినిమాలు బాగుంటున్నాయి.  రణ్వీర్ సింగ్, రణబీర్ కపూర్, వరుణ్ ధావన్ వంటి యంగ్ స్టార్స్ సూపర్ హిట్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.  సీనియర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.  షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ ల వారసులు త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నారు.  


షారుక్ కూతురు సుహానా ఖాన్ సినిమాల్లోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నది.  ఇప్పటికే ఈ అమ్మడు ఫొటోలతో పిచ్చెక్కిస్తోంది.  మ్యాగజైన్ కవర్ పేజీలపై హాట్ హాట్ ఫోజులు ఇస్తూ.. సారా అలీఖాన్ బాటలో నడుస్తోంది.  మరోవైపు అమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ కూడా సినిమాల్లోకి రావడానికి ట్రై చేస్తున్నది.  


అమీర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం.  ఈ విషయంలో సల్మాన్ ఖాన్ వెనకబడ్డాడు అని చెప్పాడు.  వయసు యాభై దాటినా ఇంకా బ్యాచులర్ గానే ఉన్నాడు.  ఎందుకో ఏమిటో తెలియదు.  పెళ్లి విషయం ఎత్తితే తప్పించుకుంటున్నాడు.  ఈ ఖాన్ లు ఇద్దరి నుంచి వారసులు వస్తున్నారు.  మరి సల్మాన్ వారసులు వస్తారా రారా.  


మరింత సమాచారం తెలుసుకోండి: