మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా దేవా కట్టా డైరక్షన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సాయి ధరం తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా పూర్తి కాగానే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఈమధ్యనే షూటింగ్ పూర్తి చేశారు. ఆ సినిమాను ఓటిటి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక దేవా కట్టా సినిమా పూజా కార్యక్రమాలు లాక్ డౌన్ కు ముందే పూర్తి అయ్యాయి. త్వరలోనే సాయి ధరం తేజ్ ఆ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడని తెలుస్తుంది.

ఈ సినిమాలో సాయి ధరం తేజ్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆల్రెడీ మెగా మేనల్లుడు నటించిన చిత్రలహరి సినిమాలో నటించిన అమ్మడు ఆ సినిమాలో హీరోయిన్ గా ఉంది కాని తేజూకి జోడీగా నటించలేదు. కాని ఇప్పుడు సాయి ధరం తేజ్ తో జతకడుతుంది నివేదా. ఈ సినిమాలో మరో సర్ ప్రైజింగ్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉంటున్నాడట. ప్రస్థానం రేంజ్ లో ఈ సినిమా ప్లాన్ చేసిన దేవా కట్టా సినిమాలో ఓ పవర్ ఫుల్ రోల్ రాసుకున్నాడట దానికి పవర్ స్టార్ అయితే అదిరిపోతుందని అనుకుంటున్నాడు.

అయితే పాత్ర నచ్చినా పవర్ స్టార్ చేసే ఛాన్స్ చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకున్నాడు. అవి చేసేందుకే టైం సరిపోతుందో లేదో అలాంటిది మళ్ళీ ఇప్పుడు వేరే హీరో సినిమాలో గెస్ట్ రోల్ అంటే చాలా కష్టం. ఒకవేళ పాత్ర నచ్చి చేస్తే మాత్రం మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే అవకాశం ఉంటుంది.                  
  

మరింత సమాచారం తెలుసుకోండి: