
అయితే ఈ పెళ్లి రెండు రోజుల క్రితమే జరిగినా సమంతా ఈరోజు ఈ ఫోటోలు షేర్ చేయడంతో ఆమె పిక్స్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సమంతా కాలేజ్ లైఫ్ లో క్లాసులకు డుమ్మా కొట్టి సినిమాలకు చెక్కేసేదట. అంతే కాదు అలా ఓసారి గోడదూకుతూ లెక్చరర్లకు పట్టుబడిపోయింది కూడా. అయితే, ఫ్రెండ్స్ మీద చాడీలు చెప్పి, వ్యవహారాన్ని వాళ్ళ మీదకు తోసేసి, తప్పించుకుందట. బీద మొహం పెట్టి, సమంతా ఇన్నోసెంట్ లుక్ ఇవ్వడంతో లెక్చరర్లు నమ్మేసి, ఈమెను వదిలేసి, ఫ్రెండ్స్ ని బుక్ చేసేశారని ఆ మధ్య ఆమె చెప్పుకొచ్చింది కూడా.
సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరుగా వెలుగుతోంది. ఇటీవల శర్వానంద్ తో నటించిన జాను విడుదలై బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది. ఇక ఆమె అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనుంది. ఈ సినిమా షూటింగ్ మార్చి నుంచి జరుగాల్సీ వుంది కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడిందని అంటున్నారు.