అక్కినేని కోడలు సమంత తన నట విశ్వరూపం చూపించేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం సమంత ఎలాంటి సినిమా కమిట్ అవలేదని తెలిసినా కన్నడ డైరక్టర్ అశ్విన్ శరవణన్ చెప్పిన కథను సమంత హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. కథ బాగా నచ్చిందట అయితే సినిమాలో సమంత మూగ అమ్మాయిగా నటిస్తుందని తెలుసుతంది. ఆల్రెడీ టాలీవుడ్ లో ఇలాంటి ప్రయోగాలు చేసిన హీరోయిన్స్ మిక్సెడ్ రిజల్ట్ అందుకున్నారు.

లేటెస్ట్ గా సమంత కూడా అదే ప్రయోగం చేసేందుకు రెడీ అంటుందట. ఎలాంటి పాత్ర ఇచ్చినా తన 100 పర్సెంట్ ఎఫర్ట్ ఇచ్చే సమంత తప్పకుండా ఈ సినిమాను కూడా అదరగొడుతుందని అంటున్నారు. సమంత ఈ సినిమాతో తన నట విస్వరూపం బయట పెడుతుందని టాక్. జాను తర్వాత ఎలాంటి సినిమా కమిట్ అవని సమంత త్వరలోనే ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ తో సత్తా చాటుతుందని అంటున్నారు.

అంతేకాదు సమంత ఈమధ్య డిజిటల్ మీడియాలో కూడా దూసుకెళ్తుంది. ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సీరీస్ లో నటించిన అమ్మడు అహా కోసం సాం జాం అంటూ స్పెషల్ షో చేస్తుంది. అశ్విన్ సినిమాతో పాటుగా మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కథ కూడా సమంత చేయబోతుందని తెలుస్తుంది. తప్పకుండా సమంత మరో ఐదారేళ్లు తన సినిమాలతో సందడి చేసేలా ఉందని చెప్పొచ్చు. తప్పకుండా సమంత పెళ్లి తర్వాత కూడా తన ఫాం ను ఓ రేంజ్ లో కొనసాగిస్తుందని చెప్పొచ్చు. సమంత చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: