టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అతి పెద్ద ఫ్యామిలీల్లో ఒకటైన మెగా ఫ్యామిలీ నుండి మొదట మెగాస్టార్ చిరంజీవి నటుడిగా ప్రాణం ఖరీదు సినిమా ద్వారా తెరంగేట్రం చేసారు. ఆ తరువాత మెల్లగా తన టాలెంట్ తో ఒక్కొక్కటిగా పలు సినిమాల్లో అవకాశాలు అందుకుని ముందుకు సాగిన మెగాస్టార్, ఆపై కొన్ని సినిమాలో విలన్ గా కూడా నటించారు. అప్పటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్, కృష్ణ సినిమాల్లో కూడా చిరంజీవి విలన్ గా నటించి మెప్పించారు.

అయితే వాటి అనంతరం హీరోగా అవకాశాలు అందుకుని కొనసాగిన చిరంజీవికి కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టి కెరీర్ పరంగా అతి పెద్ద బ్రేక్ ని ఇచ్చింది. దాని ఊపుతో మరింత వేగవంతంగా దూసుకెళ్లిన చిరంజీవి ఆపై సుప్రీం హీరోగా అనంతరం మెగాస్టార్ గా ఎన్నో గొప్ప విజయాలు అందుకుని కోట్లాదిమంది ప్రేక్షకాభిమానుల మనస్సులో మంచి స్థానాన్ని సంపాదించారు. తరువాత మెగాస్టార్ ఫ్యామిలీ నుండి ఆయన పెద్ద తమ్ముడు నాగబాబు యాక్టర్ గా పరిచయం అయినప్పటికీ ఆయన ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసారు. అనంతరం కొన్నేళ్ల తరువాత అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ రెండవ తమ్ముడు పవన్ కళ్యాణ్, తొలి సినిమా నుండి ప్రేక్షకుల్లో మంచి పేరు దక్కించుకుని ఆపై ఎన్నో విజయాలతో ప్రస్తుతం పవర్ స్టార్ గా అత్యున్నత శిఖరాలు అందుకుని దూసుకెళ్తున్నారు.

ఆయన తో పాటు అల్లు అర్జున్, రామ్ చరణ్, వైష్ణవ తేజ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, కళ్యాణ్ దేవ్ వంటి వారు మెగా ఫ్యామిలి నుండి ప్రస్తుతం హీరోలుగా పలు సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు. అసలు మ్యాటర్ ఏమిటంటే నిన్న మెగా సోదరుల తల్లి అంజనాదేవి జన్మదినం సందర్భంగా వారి ఫ్యామిలీ మొత్తం కూడా మెగాస్టార్ ఇంట్లో సందడి చేసారు. ఆ సందర్భంగా వారందరూ కలిసి దిగిన గ్రూప్ ఫోటో ని మెగాబ్రదర్ నాగబాబు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. అయితే మెగా సోదరులు అందరినీ ఒకే ఫొటోలో చాలా రోజుల తరువాత చూసిన ఫ్యాన్స్, అబ్బబ్బబ్బా ఇది కదా మాకు కావలసింది, మెగా ఫ్యామిలీ హీరోలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇలాగే ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, అలానే అంజనమ్మకు ప్రత్యేకంగా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: