అవకాశాలు లేకున్నా సోషల్ మీడియా లో దుమ్ము రేపుతున్నారు కొందరు అందాల భామలు.. ఒకటో రెండు సినిమాలు చేసి తర్వాత అవకాశాలు లేక ఇంటిపట్టునే ఉంటున్నా ఈ హీరోయిన్ లు ఎందుకు ఖాళీగా అందరు మర్చిపోయేలా గా ఉండాలి అనుకున్నారో ఏమో సోషల్ మీడియా లో తమ అందాల ఆరబోతల చేసి అందరి చూపు తమవైపు కు తిప్పుకునేలా చేస్తున్నారు. పొద్దున్న లేచిన దగ్గరినుంచి రాత్రి పడుకునే వరకు కూడా ప్రతి యాక్టివిటీ ని అభిమానులతో పంచుకుంటూ కొంచెం మసాలా యాడ్ చేసి ఆకర్షిస్తున్నారు..

ఈ దెబ్బతో వారికి సినిమాల్లో చేసిన దానికంటే ఎక్కవుగా పేరొస్తుంది. చేతిలో అవకాశాలు లేకున్నా సోషల్ మీడియాలో తమ హాట్ హాట్ ఫొటోస్ ని అప్ లోడ్ చేస్తూ యూత్ కి సెగలు పుట్టిస్తున్నారు. మరి వారెవరెవరో చూడాలని మీకు ఉంది కదా..  అవకాశాలు లేకుండా అందాల ప్రదర్శనలో ముందున్న హీరోయిన్ ఇలియానా..  బాలీవుడ్ వెళ్లిన తర్వాత లావైపోయిన ఈమెను   దర్శకనిర్మాతలు లైట్ తీసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ వర్కౌట్లు చేసి సన్నబడి.. హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ యూత్ కి పిచ్చెక్కిస్తుంది..

ఇంకా పూనమ్ బాజ్వా, అదాశర్మ, నేహా శర్మ, సోనాల్ చౌహన్ ఇలా మరికొంతమంది భామలు కూడా కుర్రకారు కు నిద్ర లేకుండా చేస్తూ అందాలు ఆరబోస్తున్నారు. బికినీ ఫోటో షూట్ అంటూ, మాల్దీవ్స్ అంటూ, వర్క్ అవుట్ ఫోటో షూట్ అంటూ ప్రతిదీ పోస్ట్ చేస్తూ అందరిని తనవైపు తిప్పుకుంటున్నారు. ఒకప్పుడు సినిమాలలో ఓ వెలుగు వెలిగి యూత్ ని పిచ్చెక్కించిన హీరోయిన్లు కూడా చేతిలో సినిమాలు లేకపోయే సరికి ఈ తరహా అటెన్షన్ ని గ్రబ్ చేసుకుంటున్నారు. మరి ఈ షో వారి కెరీర్ కి ఉపయోగపడుతుందా చూడాలి.. ఇది చూసిన దర్శక నిర్మాతలు వారికి చాన్సులు ఇస్తాడో లేదో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: