టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన నటనతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ని శర్వానంద్ ఆకట్టుకున్నాడు. యూత్ లో పెద్ద క్రేజ్ లేకపోయినప్పటికిని మిడిల్ రేంజ్ హీరోగా దూసుకుపోతున్నాడు. "రన్ రాజా రన్ ", "శతమానం భవతి","మహానుభావుడు" సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న శర్వానంద్ తరువాత వరుస ప్లాపులు ఎదుర్కున్నాడు. ఇక వరుస ప్లాపుల తరువాత మళ్ళీ ఇన్నాళ్లకు "శ్రీకారం" సినిమా చేశాడు.నానిస్ "గ్యాంగ్ లీడర్ " ఫేమ్ ప్రియాంకా అరుళ్ మోహన్ శర్వానంద్ కి జంటగా నటించింది. కిశోర్.బి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 11న శివరాత్రి కానుకగా విడుదలయ్యింది. మొదటి షో నుండీ ఈ చిత్రానికి డివైడ్ టాక్ మొదలైంది. అయినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే నమోదయ్యాయని చెప్పాలి. '14 రీల్స్ ప్లస్‌' బ్యానర్ పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.


ఇక గత చిత్రాలతో పోలిస్తే శర్వానంద్ కి ఈ సినిమా కొంచెం ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఇక 'శ్రీకారం' సినిమా వసూళ్ల విషయానికి వస్తే .. ఈ చిత్రానికి 17.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 17.5కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 8.17 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు ఇంకా 8.93 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ చాలా పెద్దది కాబట్టి..అంత రాబడుతుందో లేదో చూడాలి. ఇక ఈ వారం ఆగితే కాని ఈ సినిమా ఫలితం ఏంటో తెలీదు. చూడాలి మరి ఈ సినిమా ఎంత రాబడుతుందో... ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: