సినీ పరిశ్రమలో ఒక సినిమా బాగా ఆడింది అంటే, అందులో నటులు ఎంత కష్టపడి ఉంటారో వారికే తెలుసు. ఒక సినిమా తయారు అవ్వడం వెనుక ఎంతోమంది కష్టం ఉంటుంది. ఆ చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో మంది చమటలు చిందిస్తే తప్పా ఒక మంచి సినిమా తయారవదు. అయితే అదే సినిమా షూటింగ్ సమయంలో, కొన్ని సందర్భాలలో కొందరు ప్రాణాలను కోల్పోతే , మరికొంతమంది ప్రమాదానికి గురి కావడం కూడా జరిగింది. అయితే అలాంటి సందర్భాలలో ఎవరూ ఊహించని విధంగా కొంతమంది భయంకరమైన ఆక్సిడెంట్లకు గురయ్యారు . ఆ సందర్భాలు ఏమిటో వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం ..

1). బామ్మ మాట బంగారు బాట:
ఈ చిత్రంలో ఒక్కటే ఎపిసోడ్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్న సమయంలో కారు కు తాడు కట్టి వేలాడదీశారు. అయితే సడన్ గా కారు కింద పడిపోయింది. చాలా ఎత్తు నుండి పడిపోవడంతో నూతన్ ప్రసాద్ గారి రెండుకాళ్లను కోల్పోయారు.

2). బృందావనం:
జూనియర్ ఎన్టీఆర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం క్లైమాక్స్ పార్ట్ చిత్రీకరిస్తున్న సమయంలో ఎన్టీఆర్ ప్రమాదానికి గురయ్యాడు.

3). రచ్చ:
రామ్ చరణ్, సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక ట్రైన్ ఎపిసోడ్ ఉంటుంది. ప్రమాదం నుండి రామ్ చరణ్ తప్పించుకున్నాడు.

4). భారతీయుడు-2 :
శంకర్,కమలహాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న చిత్రం సమయంలో ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది. యూనిట్ సభ్యులు ఏకంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

5). బిందాస్:
మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం సమయంలో రిస్కీ షాట్స్ లో పాల్గొన్నారు హీరో. అందువల్ల మనోజ్ కు చిన్న యాక్సిడెంట్ జరిగింది. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

6). వరుడు:
అల్లు అర్జున్, గుణశేఖర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం క్లైమాక్స్ ఫైట్ లో చిత్రీకరణ సమయంలో అల్లు అర్జున్ చెయ్యి విరిగింది.

7).ఆది:
ఎన్టీఆర్, వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ మూవీగా నిలిచింది.  ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అయింది. ఈ క్రమంలో అతని చేతికి గాయం అవ్వడం కూడా జరిగింది.

8). జాను:
శర్వానంద్,సమంత ప్రధాన పాత్రలలో తెరకెక్కించిన ఈ చిత్రం జాను. ఈ చిత్రం షూటింగ్ సమయంలో శర్వానంద్ కు చిన్న యాక్సిడెంట్ అయింది.

9). అశ్వత్థామ:
నాగ శౌర్య హీరో గా రమణ థిస్ డైరెక్షన్ లో తెరకెక్కించిన చిత్రం అశ్వద్దామ. ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరో నాగశౌర్య కు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది.

అలాగే సైనికుడు సినిమాలో మహేష్ బాబు కు, బలాదూర్ సినిమాలో రవితేజ గ్రూపు లో కనిపించాల్సిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అంతేకాకుండా స్పైడర్ మూవీ లో మహేష్ బాబు కు ఘోర ప్రమాదం తప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: