సూపర్ స్టార్ రజిని కాంత్ కు అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 2020 సంవత్సరానికి గాను దాదాసాహేబ్ ఫాల్కే అవార్డు ను రజినీకాంత్ కు ఇవ్వాలని జ్యురీ నిర్ణయించడంతో కేంద్రం కూడా ఆమోదించింది. రజనికాంత్ సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ను ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ ప్రకటించారు.

ఇంత వరకు దక్షిణాదిన డాక్టర్ రాజ్‌కుమార్, అక్కినేని నాగేశ్వర్ రావు, కె బాలచందర్ వంటి దిగ్గజాలు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ను  అందుకున్నారు.ఇక రజనీకాంత్ ఈ అవార్డు పొందిన 12 వ దక్షిణ భారతీయుడు. అయితే తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కేంద్రం హటాత్తుగా రజినీకాంత్ కు దాదాసాహేబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటించడం తీవ్ర చర్చనీయం అయ్యింది. తమిళ నాడు అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని, డైక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ పగ వేసేందుకే ఈ అవార్డ్ ప్రకటించింది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే జన్మ దిన సందర్భంగా 1963లో ఈ పురస్కారం ప్రారంభించారు. 

భారతీయ సినిమాకు విశేషమైన సేవలు చేసిన వారికి ఈ పురస్కారాన్ని అందిస్తారు. ఈ పురష్కారాలను జాతీయ సినిమా అవార్డుల తోపాటు ఇస్తారు. ఏది ఏమైనప్పటికి రజిని కాంత్ కు ఈ పురష్కారం లభించడంపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే రజిని తమిళనాడు లో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించి ఉన్నఫలంగా ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. దీంతో బీజేపీ రజిని కి ఇస్తున్న గిఫ్ట్ అని కొందరు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. అయితే గతంలో కూడా రజినీకాంత్ తో బీజేపీ కి సత్సంబంధాలు ఉన్నాయన్న వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. మరి రజినీకాంత్ కు ఈ అవార్డ్ ఇవ్వడం వల్ల బీజేపీ పై వెల్లువెత్తుతున్న విమర్శలపై ఆ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: