మన సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు .కానీ ఇప్పుడు వెండి తెరపైనే కాదు బుల్లితెరపై కూడా వారి సత్తా చూపించి, సరిలేరు మాకెవ్వరు అంటూ దీటుగా నిలిచారు ఈ స్టార్ హీరోలు.. అయితే ఎవరెవరు సిల్వర్ స్క్రీన్ పై నే కాకుండా స్మాల్ స్క్రీన్ పై కూడా తమ సత్తా ఏంటో చూపారో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


1. చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి గా వెండితెరపై ఈయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 60 సంవత్సరాలు వచ్చినా కూడా స్టిల్ యంగ్  హీరోలాగా కుర్రకారును ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక చిరంజీవి కూడా బుల్లితెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు అనే రియాల్టీ షో లో సీజన్ ఫోర్ కు యాంకరింగ్ చేశాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి త్వరలోనే ఒక వెబ్ సీ రీ స్ లో  కూడా నటించనున్నట్టు సమాచారం.

2. నాగార్జున:
ఇప్పటికీ నవమన్మధుడు లాగా వెండితెరపై దూసుకుపోతున్న నాగార్జున, బుల్లితెరపై కూడా తన క్రేజ్ ను ఏమాత్రం తగ్గించుకోకుండా దూసుకెళ్తున్నాడు. నాగార్జున బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 3 అలాగే సీజన్ ఫోర్ లకు హోస్ట్ గా పని చేశారు. ఇక అంతకు ముందు స్టార్ మా లో ప్రసారం అయిన మీలో ఎవరు కోటీశ్వరుడు అనే  రియాల్టీ షో లో యాంకర్ గా వ్యవహరించాడు.

3. జూనియర్ ఎన్టీఆర్:
జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెరపై తెలుగులో బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించి, ఈ ప్రోగ్రాం ను సూపర్ హిట్ అయ్యేలాగ చేశాడు. అంతకుముందు ఎన్టీఆర్ ఈటీవీలో ప్రసారమైన "భక్త మార్కండేయ "అనే సీరియల్లో కూడా మార్కండేయ పాత్రలో  అలరించారు. ఇప్పుడు మరోసారి మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి రియాల్టీ షో తో ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నాడు. ఇక ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైన విషయం అందరికీ తెలిసిందే..

4. నాని:
నాచురల్ స్టార్ నాని కూడా బిగ్ బాస్ సీజన్ 2 కు హోస్ట్ గా వ్యవహరించాడు. ఈ షో లో నాని ఒక మోస్తరుగా అలరించాడు అని చెప్పవచ్చు.

5. దగ్గుబాటి రానా:
రానా దగ్గుబాటి నెం.1 యారీ అనే ప్రోగ్రాం లో స్మాల్ స్క్రీన్ పై అలరించాడు.

6. అలీ:
కమెడియన్ లకు పెట్టింది పేరు అలీ. అలీ కూడా ఆలీతో సరదాగా అనే ప్రోగ్రాం లో  పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఈ ప్రోగ్రాం భారీ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న  విషయం అందరికీ తెలిసిందే..

7. పోసాని మురళి కృష్ణ:
ఇక ఈయన కూడా పలు రియాల్టీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

8. నాగబాబు:
మెగా హీరో నాగబాబు కూడా బుల్లితెరపై తన సత్తా ఏంటో చూపుతున్నాడు.. జబర్దస్త్ కామెడీ షో తో పాటు పలు షోలకు జడ్జిగా వ్యవహరించారు..

9. నవదీప్:
యంగ్ హీరో నవదీప్ కూడా "అదిరింది " లాంటి కామెడీ షోలకు జడ్జ్ గా వ్యవహరించాడు. అయితే ఈ ప్రోగ్రాం ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయింది.

10. సాయి కుమార్:
సాయి కుమార్ కూడా ఈ టీవీలో ప్రసారం అవుతున్న వావ్ ప్రోగ్రాం లో యాంకరింగ్ చేస్తూ ,స్మాల్ స్క్రీన్ పై దూసుకుపోతున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: