తమిళ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించాడని సింగర్ చిన్మయి రెండుమూడేళ్ల క్రితం తమిళ సీనియర్ లిరిసిస్ట్ వైరముత్తుపై తీవ్ర ఆరోపణలు చేశారు. #మీటూ ఉద్యమంలో ఆమె చేసిన ఆరోపణలు సౌత్ ఇండస్ట్రీలోనే కలకలం సృష్టించాయి. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ సంఘ అధ్యక్షుడిపై కూడా చిన్మయి ఆరోపణలు చేశారు. దీంతో ఆమె కెరీర్ మొత్తం దెబ్బతిన్నది. ఏవో కారణాలు చూపుతూ ఆమెను డబ్బింగ్ యూనియన్ నుంచి బ్యాన్ చేయడం జరిగింది. దీంతో ఆమె కోర్టుకెక్కింది. వేధింపులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం మానేసి తమ పొట్టకొట్టే ప్రయత్నాలు చేయడం ఏంటనీ.. తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె వైరముత్తు మీద ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ సాయం కోరింది. మేనకాగాంధీ కూడా ఆమెకు సాయం అందించారు. అంతేకాకుండా కోర్టు ఆమెకు సానుకూలంగా తీర్పునిచ్చింది. అయినా.. అవకాశాలు మాత్రం లభించడం లేదు.

బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా తనపై నానా పాటేకర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపించడంతో మీటూ ఉద్యమం మొదలైంది. ఇదే సమయంలో చిన్మయి శ్రీపాద కూడా తనపై జరిగిన లైంగిక వేధింపులపై ఫిర్యాదులు చేసింది. సినీ ప్రముఖులపై ఫిర్యాదులు చేయడంతో సినిమా రంగంలో ఒక్క అవకాశం కూడా దక్కడం లేదు. దీంతో ఆర్థికంగా కూడా ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తాజాగా అభిమానులకు ఆమె ఓ వీడియో సందేశం పంపారు. ఈ వీడియో చూసిన తర్వాత ఆమె ఎంత కష్టాల్లో ఉందో తెలుస్తుంది.

తనకు అవకాశాలు లేవని, డబ్బుల అవసరం చాలా ఉందని, అందువల్ల ఎవరికైనా నచ్చిన పాటలు చెబితే అవి పాడి వీడియోలు పంపుతానని అభ్యర్థించింది. అవి నచ్చితే దానికి కొంత డబ్బులు పంపాలని ఆమె అభిమానులను కోరారు. తాను ముగ్గురు స్టూడెంట్స్‌ను చదివించాల్సి ఉందని, వారిలో మెడికల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారని, వారి ఫీజ్ కోసమే ఈ డబ్బులు అవసరమని చెప్పారు. ఈ పరిస్థితిని బట్టే ఆమె కెరీర్ ఎంతలా దెబ్బతిందో అర్థం చేసుకోవచ్చు. ఇండస్ట్రీలో కీలక వ్యక్తులై ఆమె చేసిన ఆరోపణలు ఆమె కెరీర్‌ను దాదాపు ఎండ్ చేశాయనే చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: