సినీ పరిశ్రమలో అమితాబ్ బచ్చన్ తెలియని వారు ఉండరనే చెప్పాలి. బాలీవుడ్ బిగ్ బి గా పేరున్న అమితాబ్ బచ్చన్ ఈ రోజు తన 48 వ పెళ్లి రోజును తన భార్య జయా బచ్చన్ తో జరుపుకుంటున్నారు. ఈ మంచి రోజును పురస్కరించుకుని అమితాబ్ తన పెళ్లి రోజు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఫోటోలు చాలా మందికి తెలిసి ఉండవు. అమితాబ్ మరియు జయాబచ్చన్ ఎంతో ఇష్టపడి జూన్ 3 1973 న వివాహాం చేసుకున్నారు. అమితాబ్ పోస్ట్ చేఇస్నా పిక్స్ కి విశేష స్పందన లభిస్తోంది. బాలీవుడ్ లోని నటులు మరియు స్నేహితులు అందరూ వీరిద్దరికీ విషెస్ చెబుతున్నారు. వీరందహారో తెలుపుతున్న శుభాకాంక్షలకి రిప్లై గా అమితాబ్ బచ్చన్ ఈ విధంగా తెలిపాడు. మా ఈ వివాహమహోత్సవం సందర్భంగా నాకు జయాకి శుభాకాంక్షలు తెలిపిన అందరికీ నా కృతజ్ఞతలు.

ఈ రోజుతో మేమిద్దరమూ 43 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని అనుభవిస్తున్నాము. ఇన్ని సంవత్సరాలు మీ దయగల ప్రేమ మరియు మాటలను మమ్మల్ని ఎంతగానో ఆనందపరిచాయి అని చెప్పాడు.  వీరి వైవాహిక జీవితానికి మరయు బంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలను కలిగి ఉన్నారు. ఒకరు పెద్దమ్మాయి శ్వేతా బచ్చన్ నంద మరియు అబ్బాయి అభిషేక్ బచ్చన్. అమితాబ్  మరియు జయా బచ్చన్ లు ఇద్దరూ కూడా కొన్ని సినిమాలాలో కలిసి నటించారు. ఈ విధంగా వీరికి చాలా మధుర స్మృతులు మరియు సినీ జంపకాలు ఉన్నాయి. వీరు నటించిన సినిమాలలో 'గుడ్డి', 'ఏక్  నజర్ ', 'బావార్చి ', 'షోలే ', 'కభీ  ఖుషి  కభీ  ఘమ్ ', 'అభిమాన్ ' వంటివి ఉన్నాయి. ముఖ్యంగా షోలే సినిమా గురించి ఏ ప్రేక్షకుడూ మరిచిపోలేడు.

ఇప్పటికీ ఈ సినిమా టీవీలలో వస్తే అందులో లీనమైపోతారు. తన నటనతో డైలాగు డెలివరీతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయగల టాలెంట్ అమితాబ్ సొంతం. ఇంత వయసులోనూ అమితాబ్ సినిమాలలో నటిస్తున్నాడు. నటనపై అతనికున్న అమితమైన గౌరవం మరియు నిబద్ధతకు గుర్తుగా చెప్పవచ్చు. అమితాబ్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోలు జయా బచ్చన్ షాక్ అయ్యేలా చేసుంటాయి. వీరిద్దరూ కలకాలం అందముగా ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుందాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: