టాలీవుడ్ లో వెరైటీ సినిమాలు చేసే హీరోల జాబితా రోజురోజుకీ ఎక్కువైపోతుంది. కాకపోతే వారు ఒకే జోనర్ లోని సినిమాలను చేస్తూ ప్రేక్షకులను కొంత నిరాశ పరుస్తున్నారు. ఒకరు రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్ లో, ఇంకొకరు హర్రర్ జోనర్ లో, మరొకరు యాక్షన్ జోనర్ లో సినిమాలు చేస్తూ ఒకే రకపు మూస పద్ధతికి అలవాటు పడుతున్నారు.  వాటిలో కొన్ని సినిమాలు సక్సెస్ కావడంతో అలాంటి సినిమాలను చేయడానికి వారు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. రొటీన్ కి భిన్నంగా వెరైటీగా ఏదైనా చేస్తే ఒకసారి స్వాగతిస్తారు ప్రేక్షకులు. కానీ మళ్లీ మళ్లీ ఆ ప్రయోగాలను ఆదరించరు.

ఆ ప్రయోగాలు కూడా రోటీన్ అయిపోతే స్టార్ హీరో కావలసిన హీరోలు అక్కడే ఆగిపోతారు. ఆ విధంగా హీరో అడవి శేష్ ఇప్పుడు అలాంటి సమస్య ఎదుర్కొంటున్నాడు. హీరో అన్నాక అన్ని రకాల పాత్రల్లో నటించాలి. అప్పుడే పేరు వస్తుంది. కానీ ఒక్క జోనర్ లోనే వరుసగా అలాంటి సినిమాలు చేస్తే వేరే పాత్రలకు సదరు హీరోనీ ఎవరు సజేస్ట్ చేయరు.   అలాంటి పాత్రలు తప్ప ఆయనకు వేరే పాత్రలు రావు కూడా. అలా టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉన్న అడవి శేష్ వరుసగా థ్రిల్లర్, యాక్షన్, క్రైమ్ జోనర్ లకే పరిమితం అయిపోతున్నాడు.

అయన హీరో గా క్షణం, గూడచారి, ఎవరు వంటి సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం చేస్తున్న మేజర్ సినిమా కూడా దానికి సంబంధించినదే.. అంతేకాదు ఆయన తర్వాత సినిమా గా చేస్తున్న హిట్ 2 కూడా అదే జోనర్ లోని సినిమా. మరి అడవి శేష్ కావాలని ఇలాంటి సినిమాలు చేస్తున్నాడా లేదా యాదృచ్చికంగా అన్నీ ఇలాంటి అవకాశాలు వస్తున్నాయా అనేది ఎవరికీ తెలియదు. మొదట్లో రొమాంటిక్, లవ్ , ఎంటర్ టైనర్ సినిమాలను చేశాడు. అవి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే ఈ జోనర్ కి మారాడో అప్పటినుంచి సక్సెస్ ను అందుకున్నాడు.  కనుక ఇప్పట్లో వేరే జోనర్ ను టచ్ చేసేలా కనిపించడం లేదు ఈ యంగ్ హీరో. మరి ఫ్యూచర్ లో నైనా అన్ని రకాల జోనర్ కథలు అడవి శేష్ చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: