తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లు రాబడుతోంది చెప్పడం చాలా కష్టం. అందుకే ఇటీవల సినిమా విడుదలకు ముందే ఫస్ట్ లుక్, టీజర్లను విడుదల చేసి సినిమాకు  ప్రేక్షకులలో హైప్ ని పెంచుతూ ఉంటారు. ముఖ్యంగా థియేటర్ నుంచి మొదలుపెడితే.. డిజిటల్ వరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కాకపోతే కొన్ని సినిమాలను మాత్రమే ప్రేక్షకులు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అయ్యేలా చేస్తున్నారు. అది గ్రాఫిక్స్ పరంగా అయినా కావచ్చు.. లేదా కథాపరంగా అయినా కావచ్చు.. బాక్సాఫీస్ వద్ద ఎక్కువ షేర్ ని రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఆ సినిమాల గురించి ఇప్పుడు ఇక్కడ చదివి  తెలుసుకుందాం..


1. బాహుబలి:
ఎక్కువ షేర్ ను రాబట్టిన సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చే సినిమా బాహుబలి. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో  2015 లో వచ్చిన బాహుబలి. ఈ సినిమాను రూ.125 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఒక ఊహించని విధంగా 650 కోట్ల రూపాయల షేర్ ను  రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 2017 లో వచ్చిన బాహుబలి 2 సినిమాను రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ఎవరూ ఊహించని విధంగా రూ.1607 కోట్ల షేర్ ను  రాబట్టి ఇండస్ట్రీ హిట్ రికార్డులను బ్రేక్ చేసేసింది. ఇక కేవలం తెలుగులోనే రూ.325 కోట్ల షేర్ ను  రాబట్టింది.

2. అత్తారింటికి దారేది:
పవన్ కళ్యాణ్ హీరోగా , త్రివిక్రమ్ దర్శకత్వంలో 2013లో విడుదలైన చిత్రం అత్తారింటికి దారేది. ఈ చిత్రం కూడా తెలుగులో రూ.77 కోట్ల షేర్ ను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

3. మగధీర:
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన చిత్రం మగధీర. ఇక తన రెండవ చిత్రం అయిన మగధీర సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోల లిస్టులో కి ఎదిగిపోయాడు రామ్ చరణ్. ఈ చిత్రం కూడా తెలుగులో బాక్సాఫీస్ వద్ద రూ. 70 కోట్ల షేర్ ను రాబట్టింది.

4. పోకిరి:
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం పోకిరి. ఈ చిత్రం రూ.40 కోట్ల షేర్ ను రాబట్టింది.


5. సింహాద్రి:
NTR హీరోగా రాజమౌళి దర్శకత్వంలో 2003 లో వచ్చిన సినిమా సింహాద్రి. ఈ చిత్రంలో భూమిక, అంకిత  హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం 37 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టి ఇండస్ట్రీ హిట్ కొట్టింది.

6. ఇంద్ర :
2002 వ సంవత్సరంలో చిరంజీవి హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇంద్ర. ఈ చిత్రం కూడా రూ.29 కోట్ల షేర్ ను రాబట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: