మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మిస్ వరల్డ్ కీరీటం దక్కించుకున్నాక బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘ కాలం స్టార్ హీరోలతో సమానంగా దూసుకుపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రియాంక చోప్రా ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా వరుస సినిమాలు ఇంకా వెబ్ సిరీస్ లతో హాలీవుడ్ లో బాగా దూసుకుపోతుంది. ఓ వైపు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ మరో వైపు హాలీవుడ్ లో కూడా ఎక్కువ ఫోకస్ పెట్టిన ఈ హాట్ బ్యూటీ మూడు సంవత్సరాల క్రితం అమెరికన్ పాప్ సింగర్ అయినా నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లాడింది. ఇక పెళ్లి తర్వాత కూడా ప్రియాంక చోప్రాకు అంతర్జాతీయ స్థాయిలో మరింతగా గుర్తింపు దక్కించుకుంది. నిక్ జోనస్ బ్రాండ్ ఇమేజ్ తో ఈ హాట్ బ్యూటీ ఇంకా మరింత పాపులర్ అయ్యింది అనడంలో సందేహం లేదు. ఇక వీళ్ళ పెళ్లి సమయంలో పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేసినా కూడా ఇద్దరు మాత్రం చాలా ఆనందంగా ఇంకా ప్రశాంతంగా తమ జీవితాన్ని సాగిస్తున్నారు.

ఇక ఈ రోజు ప్రత్యేకమైన రోజుగా ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో పేర్కొనడం జరిగింది.ఈ రోజు తమ ఇద్దరి మద్య ప్రేమ అనేది బాగా పుట్టిందని.. సరిగ్గా ఇదే రోజున తమ ప్రేమను వ్యక్త పర్చుకున్నట్లుగా ఆమె ఆనందంతో ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ఈ మూడు సంవత్సరాల కాలం రెప్ప పాటులో పూర్తి అయినట్లుగా అనిపిస్తుంది ఐ లవ్ యూ అంటూ ప్రియాంక చోప్రా పోస్ట్ షేర్ చేసింది. నిక్ కూడా ఈరోజుకి మూడు సంవత్సరాలు అంటూ పోస్ట్ పెట్టాడు. వీళ్ళిద్దరి లవ్ యానివర్శరీ కూడా జరుపుకోవడం కొత్తగా ఉందని మీ ఇద్దరి మద్య ఈ అపూర్వమైన ప్రేమ ఎప్పటికి ఇలాగే ఉండాలంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి పోస్ట్ లు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక మరో వైపు వీరి ప్రేమను అప్పట్లో అవమానించిన వారు ఇంకా అనుమానించిన వారు ఏమయ్యారు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నాను. ప్రియాంక చోప్రా కంటే తన భర్త నిక్ పదేళ్లు చిన్నవాడు.ఈ కారణంతో వీరి ఇద్దరి మద్య ఒకటి రెండేళ్ల కంటే ప్రేమ బంధం కొనసాగదు అంటూ చాలా మంది అప్పుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం హాలీవుడ్ లో తన మార్కెట్ ను పెంచుకోవడం కోసం ప్రియాంక చోప్రా అతడిని పెళ్లి చేసుకుంటుంది అని కామెంట్స్ చేసిన వారు కూడా చాలా మందే వున్నారు. అయినా కూడా వీరు ఇద్దరు ప్రేమతో ముందుకు సాగారు. మూడు ఏళ్లు అయినా కూడా వీరి జీవితాన్ని ఎంతో ఆనందంగా  గడుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: