ఉత్తర ప్రదేశ్ లోని లక్నో లో లో మద్యం మత్తులో రోడ్డెక్కిన ఓ యువతి వీరంగం సృష్టించిన సంగతి  తెలిసిందే. గత రెండు మూడు రోజుల నుండి దానికి సంభందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యువతి రోడ్డుపై నడుస్తూ మ‌ద్యం మ‌త్తులో ఉండగా సడన్ ఒక క్యాబ్ వచ్చి బ్రేక్ వేసింది. దాంతో ఆ క్యాబ్ డ్రైవర్ ను బయటకు లాగి యువతి  దారుణంగా కొడుతూ కొంత దూరం వ‌ర‌కూ తీసుకువెళ్లింది. అంతే కాకుండా అత‌డి ఫోన్ నేలకేసి పగలగొట్టింది. అయితే మొదట తప్పు క్యాబ్ డ్రైవ‌ర్ దే అని నెటిజన్లు భావించారు. ఇక డ్రైవ‌ర్ ను ఎగ‌రేసి కొట్ట‌డంతో యువతి ఆడపులి ప్రశంసలు కురిపించారు. కానీ ఆ తర్వాత వీడియోను పరిశీలించగా తప్పంతా ఆ యువతి అని తేలింది   . 

మద్యం మత్తులో యువతి క్యాబ్ డ్రైవర్ పై దాడి చేసిందని స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వీడియో చూస్తేనే త‌ప్పంతా యువ‌తిదని అర్థం అవుంతోంది. దాంతో ప్రస్తుతం ఆ యువతి పై నెటిజన్లు అంతా దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక ఈ ఘటనపై మహిళ ల సమస్యపై తరచూ మాట్లాడే సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఫెమినిస్ట్ అయిన  చిన్మయి శ్రీపాద స్పందించింది. ప్ర‌తి సారి మ‌హిళ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయాల‌పై మాట్లాడే చిన్మ‌యి ఈ కేసులో యువ‌తిదే త‌ప్పు అని ఒప్పుకుంది.  ఈ విషయంలో యువతి  తప్పు ఉంద‌ని వ్యాఖ్యానించింది. 

అంతే కాకుండా ఇలా ఎవరు చేసినా తప్పే అని స్పందించింది. కాగా చిన్మ‌యి ఈ ఘటనపై స్పందించడంతో కొంతమంది. ఆమెపై  ట్రోల్స్ చేస్తున్నారు. ఇష్టమొచ్చినట్టుగా తిడుతున్నారు. ఇది ఇలా ఉంటే చిన్మయి తనకు సోషల్ మీడియాలో వస్తున్న ఫోటోలు మరియు వీడియోలు దారుణంగా ఉంటున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కొంతమంది పురుషులు తమ ప్రైవేట్ పార్ట్స్ ను ఫోటోలు తీసి పంపిస్తారని.... తనకే కాదని  నటీమణులు అంద‌రికీ కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపింది. అంతేకాకుండా కొంత‌మంది పురుషులు దారుణమైన వీడియోలు కూడా షేర్ చేస్తారని చెప్పుకొచ్చింది. అలాంటి వీడియోలు, ఫోటోల‌ను మీరు చూడ‌లేరంటూ నెటిజ‌న్ల‌ను ఉద్దేశించి చిన్మయి వ్యాఖ్యానించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: