ప్రస్తుతం అనసూయ ఇటు బుల్లితెరపై, అటు వెండి తెరపై కూడా తన అందచందాలతో కుర్రకారును మంత్రముగ్ధుల్ని చేయడమే కాకుండా ఎంతో మంది ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. అంతేకాదు వెండితెరపై ఉండేటువంటి ఎంతో మంది హీరోలతో కలిసి నటిస్తున్నది. ఇక అంతే కాకుండా తనదైన శైలిలో పాత్రలను వేస్తూ ప్రేక్షకులను మరింత ఎక్కువ మంది తనవైపు తిప్పుకునేలా చేసుకుంటుంది. వెండితెరపై ఆమె నటించిన ఎన్నో సినిమాలలో ఆమెకు బాగా గుర్తింపు వచ్చిన పాత్ర రంగమ్మత్త. ఇక ఆ సినిమాతో అమాంతం తన స్టార్ స్టేటస్ మారిపోయింది అని చెప్పవచ్చు.

ఇక ఆ సినిమా తర్వాత సుకుమార్ మరొక సినిమాలో కూడా ఆమెకు ఛాన్స్ ఇవ్వడం గమనార్హం. అంతేకాదు  తనకోసం ఒక ప్రత్యేకమైన పాత్రను ఉండేలా సుకుమారి జాగ్రత్త వహించాడట.. ఆ సినిమాని పుష్ప. పుష్ప సినిమాలో అనసూయకు ఒక కీలకమైన పాత్ర ఇచ్చినట్లు సమాచారం. ఇకపోతే ఈ రోజు పుష్ప సినిమా నుంచి అనసూయ పాత్ర లీక్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ పిక్ ని చూసిన ప్రతి ఒక్కరు మొట్టమొదటిసారిగా డిఫరెంట్ లుక్ తో కనిపించనుంది అనసూయ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.

ఇటీవల హీరోయిన్లతో సమానంగా అనసూయ కూడా ఆఫర్లను కొట్టేస్తోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే మొన్నామధ్య మహేష్ బాబు కూడా సర్కారు వారి పాట సినిమాలో అనసూయ పాత్ర ను ఖచ్చితంగా పెట్టాలని కూడా చెప్పాడట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఆ సినిమాలో చేయలేకపోయింది. ఇక ఇటీవల లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ముందుకు వచ్చిన అనసూయ, ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలలో నటించడానికి రెడీ అవుతోంది. అంతే కాదు మరి కొంత మంది స్టార్ హీరోలు కూడా తమ సినిమాలో అనసూయ  ఉండేలా చూసుకోవాలని డైరెక్టర్లు కూడా సలహా ఇస్తున్నారట. ఇక దీన్ని బట్టి చూస్తే అనసూయ క్రేజ్  ఎంత ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: