స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా జోనస్ మంగళవారం జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. గతంలో దీపికా పదుకొనే చైర్‌పర్సన్‌గా ఉండేది. అయితే ఆమె 4 నెలల క్రితం ఈ పదవికి రాజీనామా చేసింది. ప్రియాంక చోప్రాను జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్ చైర్‌పర్సన్‌గా మామి బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు నియా అంబానీ, అనుపమ చోప్రా, అజయ్ బిజిలీ, ఆనంద్ మహీంద్రా, ఫర్హాన్ అక్తర్, ఇషా అంబానీ, కబీర్ ఖాన్, కిరణ్ రావు, రాణా దగ్గుబాటి, రితేష్ దేశ్ ముఖ్, రోహన్ సిప్పీ, సిద్ధార్థ్ రాయ్ కపూర్ నామినేట్ చేసారు. విశాల్ భరద్వాజ్, జోయా అక్తర్ పాల్గొన్నారు.

ప్రియాంక ఈ పదవిని అందుకున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఫీల్ అవుతోంది. పవర్‌హౌస్ మహిళలతో కలిసి పని చేయడాన్ని ఆస్వాదించబోతున్నానని, ఈ వేడుకను వేరే స్థాయికి తీసుకెళ్లబోతున్నానని ఆమె చెప్పింది. ఈ పండుగ చిన్న సినిమాలకు సంబంధించి చాలా తక్కువ సమయంలో చాలా మంచి పని చేసింది.

ప్రియాంక ఇంకా మాట్లాడుతూ మేము ఇప్పుడు సినిమా, వినోదాన్ని చాలా భిన్నమైన రీతిలో అనుభూతి చెందుతున్నాము. మేము సినిమా ప్రపంచాన్ని మరింతగా విస్తరించాము. నేను ఎప్పుడూ భారతీయ సినిమాలకు సపోర్ట్ గానే ఉంటాను. భారతీయ సినిమాని ప్రపంచానికి చూపించగల బలమైన వేదికను సృష్టించాలని మేము ఆశిస్తున్నాము.

బోర్డు ట్రస్టీ ఈషా అంబానీ మాట్లాడుతూ "ప్రియాంక ఇందులో చేరడం పట్ల మా బృందం చాలా సంతోషంగా ఉంది. మనం సినిమా శక్తిని ఇంకా పెంచాలి. బోర్డులో చేరడానికి నా ప్రత్యేక స్నేహితురాలు ప్రియాంకను నేను స్వాగతిస్తున్నాను. ఆమె దానిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళుతుందని ఆశిస్తున్నాను. ఆమె గ్లోబల్ ఆర్టిస్ట్, చాలా మంచి మానవతావాది" అని అన్నారు.

ప్రియాంక చోప్రా గ్లోబల్ ఐకాన్ అని, తన అభిరుచితో ఆమె మామిని వేరే స్థాయికి తీసుకెళుతుందని అనుపమ చోప్రా అన్నారు. ప్రియాంక కాకుండా మరో ఇద్దరు కొత్త వ్యక్తులు ఇందులో చేరారు. గత సంవత్సరం కోవిడ్ కారణంగా నిర్వాహకులు జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్‌ను వాయిదా వేశారు. ఇందులో ప్రియాంక కాకుండా చిత్రనిర్మాతలు అంజలి మీనన్, శివేంద్ర సింగ్ కూడా చేరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: