మెగాస్టార్ చిరంజీవి తో టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా చేయాలనే కోరిక అలాగే ఉండిపోయింది. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో పనిచేసిన త్రివిక్రమ్ కు మెగాస్టార్ సినిమా అందని ద్రాక్షగానే ఇప్పటివరకు మిగిలిపోయింది. కారణమేంటో తెలియదుగానీ సెట్స్ పైకి వెళుతుందన్న ప్రతిసారి వీరి కాంబినేషన్ లో వచ్చే సినిమా వాయిదా పడుతూనే వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఎంతటి పెద్ద దర్శకుడితో సినిమా చేసినా సరే కథ విషయంలో ఏ విధంగా కాంప్రమైజ్ కాడు. గతంలో కూడా చాలామంది దర్శకుడు చిరు ని ఒప్పించలేక సినిమానే వదిలేసి పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. 

 ఆ విధంగా త్రివిక్రమ్ తో కథ విషయంలో చాలా అభిప్రాయభేదాలు వచ్చాయని దాంతోనే ఈ సినిమా పట్టాలెక్కలేదు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ తాజాగా వీరిద్దరి మధ్య సినిమా రాకపోవడానికి కారణం వేరే ఉందట.  మెగాస్టార్ చిరంజీవి గతంలో ఇచ్చిన కమిట్మెంట్ల వల్ల త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి టైమ్ ఇవ్వలేక పోతున్నాడట. దాంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రోజురోజుకు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. మరోవైపు త్రివిక్రమ్ స్టార్ హీరోలతో సినిమా చేయడం కూడా ఈ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి మరింత కారణం. 

ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ ఆమె సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాను కూడా త్వరలోనే మొదలుపెట్టాలని చూస్తున్నాడో చిరంజీవి. ఇక బాపు దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న వాల్తేరు వీరన్న సినిమా కూడా లైన్ లోనే ఉంది. ఇటు త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాల తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: