బాలక్రిష్ణ వందవ చిత్రం గుర్తుందిగా. గౌతమి పుత్ర శాతకర్ణి. టాలీవుడ్ లో ఎంతటి సంచలనం క్రియేట్ చేసిందో ఇప్పటికీ చెప్పుకుంటారు. ఈ మూవీ చారిత్రాత్మక కధాంశంతో తీశారు. బాలయ్య తన వందవ చిత్రానికి సరిపోయే విధంగా దీన్ని రూపొందించారు. సూపర్ హిట్ అందుకున్నారు.

ఆ తరువాత బాలయ్య చకచకా అనేక సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే గత రెండేళ్ళుగా కరోనా కారణంగా బాలయ్యే కాదు ఎవరూ సినిమాలు రిలీజ్ చేయలేని పరిస్థితి. అయితే ఇపుడు బాలయ్య అఖండ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ మూవీ తరువాత వరసబెట్టి మరో మూడు సినిమాలు కూడా  క్యూలో ఉన్నాయి. బోయపాటి కాంబోలో వస్తున్న అఖండ మూవీ  బాలయ్యకు 106వ సినిమాగా ఉంది. దీని తరువాత క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య 107వ చిత్రాన్ని నటిస్తున్నారు. ఈ మూవీ ఒక రియల్ స్టోరీ ఆధారంగా తయారవుతోంది.

దీని తరువాత అనిల్ రావిపూడితో చేసే మూవీ 108గా ఉంటుంది. ఇక 109 మూవీ పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో బాలయ్య చేస్తారని టాక్. ఇలా వరసబెట్టి సినిమాలను లైన్ లో పెట్టిన బాలయ్య 110 సినిమాకు మాత్రం అద్భుతమైన కధనే రెడీ చేస్తున్నారు. ఇప్పటికి ముప్పయేళ్ల క్రితం నిర్మించిన ఆదిత్య 369 మూవీ సీక్వెల్ గా దీన్ని తీస్తారు అంటున్నారు. ఈ మూవీ ద్వారానే బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇస్తారు అంటున్నారు. ఇక ఈ మూవీలో బాలయ్య ద్విపాత్రాభినయం కూడా చేస్తారట. మొత్తానికి బాలయ్య 110 మూవీ టాలీవుడ్ లో మరో బ్లాక్ బస్టర్ అవుతుంది అని అంటున్నారు. దాని కోసం ఇప్పటి నుంచే ఫ్యాన్స్ వెయిటింగ్ మరి.  ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఈ మూవీకి బాలయ్యే దర్శకత్వం చేస్తారని ప్రచారం అయితే సాగుతోంది. అదే జరిగితే నందమూరి అభిమానులకు పండుగే కదా.



మరింత సమాచారం తెలుసుకోండి: