
యాంకర్ రవి తన వివాహం గురించి ప్రకటించడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇన్ని రోజులు తనకు పెళ్లే కాలేదు అన్నవాడు సడన్ గా తనకు పెళ్లి అయిందని, కూతురు కూడా ఉందని చేప్పడంతో నెట్టింట వైరల్ గా మారింది. గతంలో యాంకర్ రవి వ్యాఖ్యాతాగా నిర్వహించిన ఢీ షోలో యాంకర్ లాస్యతో ప్రేమలో ఉన్నాడని పుకార్లు ఎన్నో వచ్చాయి. ఆ పుకార్లకు దానికీ ధీటుగానే లాస్యతో చనువుగానే ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత యాంకర్ లాస్య మంజునాధ్ అనే అతన్ని ప్రేమిస్తున్నాని ప్రకటించింది. అలాగే అతన్నే పెళ్లి చేసుకుంది. యాంకర్ రవి లాస్యతో పాటు పటాస్ షో సమయంలో యాంకర్ శ్రీముఖీతో ప్రేమలో పడ్డారని గాస్సిప్స్ వచ్చాయి. దీని పై యాంకర్ రవి స్పందించకుండా కాలయాపన చేశారు. ఆ ప్రేమాయణాలు అన్ని పుకర్లేనని చెప్పి తన వివాహం గురించి ప్రకటించారు.