మహేష్ బాబుతో డైరెక్టర్ త్రివిక్రమ్ అతడు సినిమా తీసి బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచాడు. తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో సినిమా ఖలేజా కూడా సినిమా ఇప్పుడు చూస్తే అత్యద్భుతంగా ఉన్నప్పటికీ ,అప్పుడు మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదు. కేవలం అతడు సినిమాలో మహేష్ బాబును చాలా సైలెంట్ గా చూపించిన డైరెక్టర్ త్రివిక్రం, ఖలేజా సినిమాలో గలగల మాట్లాడే వ్యక్తిగా మాటలు మాయదారి గా మహేష్ ను చూపించాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక మొదటి ఆటో తోనే అట్టర్ ప్లాప్ అనే సారు ప్రేక్షకులు. రెండూ భారీ డిజాస్టర్ లతో కొట్టుమిట్టాడుతున్న త్రివిక్రమ్, ఈసారి హిట్ కొట్టాలంటే మంచి కథతో ముందుకు రావాలి లేదా ముందు హిట్ కాంబినేషన్ అయినా మళ్ళీ రావాలి.


అలా వెంకటేష్ తో సినిమా తీయాలనుకున్న కొన్ని కారణాల చేత ఆగిపోవడంతో,  మూడు నెలల పాటు ఖాళీగా ఉన్నాడు . ఎలాగైనా  సరే ఈసారి విజయాన్ని సాధించాలి అనుకొని , పట్టుదలతో కసితో ఒక కథను సిద్ధం చేశాడు. కథ రెడీ చేసిన తర్వాత ఒక లైను అల్లు అర్జున్ కు  వినిపించడం జరిగింది. ఒక్క లైన్ తోనే షాక్ లో దిగిపోయిన అల్లుఅర్జున్ ..చేస్తే ఈ సినిమానే చేస్తాను అంటూ పట్టుబట్టాడు . అంతేకాదు ఇలాంటి సినిమా మిస్ చేసుకుంటే చాలా నష్టపోతామని సినిమా ఒప్పేసుకున్నాడు అల్లు అర్జున్. వెంటనే దేశముదురు లాంటి సక్సెస్ ఫుల్ విజయాన్ని అందించిన దేశముదురు నిర్మాత డివివి దానయ్యను  లైన్లో పెట్టేసాడు అల్లు అర్జున్.


ఇక ఈ నిర్మాణంలో హారిక హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ కూడా ఒక భాగమయ్యారు. అల్లు అర్జున్ బ్లాక్ బాస్టర్ సినిమా వస్తోంది అని నిర్మాతలు కూడా పనులు మొదలు పెట్టేశారు. 2011 మే నెలలో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది.. కానీ అల్లు అర్జున్ చేతికి గాయమవడంతో సర్జరీ చేయించుకోవాలని త్రివిక్రమ్ అల్లుఅర్జున్ ను పట్టుబట్టాడు. ఈ సినిమా మొత్తం యాక్షన్ తోనే నడుస్తుంది కాబట్టి తప్పకుండా చేయించుకోవాలి అని చెప్పడంతో, ఆస్ట్రేలియా వెళ్లి సర్జరీ చేయించుకున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా రావు రమేష్ ,రాజేంద్రప్రసాద్ ను ఎంచుకున్నారు. ఇక విలన్ గా కన్నడ స్టార్ సుదీప్ ను అనుకోవడం.. అతనికి డేట్స్ కుదరక పోవడంతో సోనుసూద్ సెలెక్ట్ చేయడం జరిగింది.


ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను మొత్తం విశాఖపట్నం, చెన్నై శివార్లలో తీయడం జరిగింది. సినిమాకు హానీ అనే టైటిల్ పెట్టాలని అనుకోగా, షూటింగ్ ముగిసేసరికి జులాయి పెడితే బాగుంటుందని ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేశారు. 36 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ హక్కులను ఇరవై మూడు కోట్లకు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. 2014 ఆగస్టు 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 1600 స్క్రీన్లలో సినిమా  విడుదల చేయడం జరిగింది. ఇక మొత్తంగా యాక్షన్ సీన్లు, కామెడీ సీన్లు ప్రేక్షకులను బాగా మెప్పించడం తో మొత్తానికి వందల కోట్లల్లో షేర్లు రాబట్టి అత్యధిక విజయాన్ని అందించింది ఈ చిత్రం.


మరింత సమాచారం తెలుసుకోండి: