మన తెలుగు సినీ పరిశ్రమలో సినిమాలకు సంబంధించి ఏ సినిమా కథ అయినా చివరికి సుఖాంతం అవుతుంది. అవ్వాలి కూడా. ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా సినిమా చివరలో హ్యాపీ ఎండింగ్ కే అలవాటు పడిపోయారు. అయితే ఓ సినిమాని బాధతో ముగిస్తే ఎక్కువ మంది ఆడియన్స్ కి అది నచ్చకపోవచ్చు.బాధతో ముగింపు కనిపించే ఏ సినిమా అయినా ట్రాజెడీయే.ముఖ్యంగా హీరో, హీరోయిన్ సినిమా చివర్లో చనిపోతే అది ట్రాజెడి అవుతుంది. అంతేకాదు చివర్లో హీరో, హీరోయిన్ కలుసుకోకపోయినా దాన్ని విషాదాంతం అనే చెప్పాలి.ఇలా చాలా సినిమాలు హ్యాపీ ఎండిగా, స్యాడ్ ఎండిగ్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాయి.

 కానీ వీటిలో ఎక్కువగా సుఖాంతం అయిన కథలే ఎక్కువ శాతం విజయాలను అందుకున్నాయి.దుఃఖాంతాలు సైతం కొన్ని ఘన విజయాలను సొంతం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.ఏది ఏమైనా ప్రేక్షకులు తమకి నచ్చిన వాటినే విజయపథంలో పయనింపజేస్తారు అనేదే నిజం.ఇక ఈ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే..తాజాగా విడుదలైన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ 'రిపబ్లిక్' సినిమాలోనూ ట్రాజెడీ ఎండింగ్ ని చూపించాడు ఈ సినిమా దర్శకుడు దేవా కట్టా. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎండింగ్ లో హీరో సాయి ధరమ్ తేజ్ మరణిస్తాడు.ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది.

 ఈ సినిమా మొత్తాన్ని ఆద్యంతం ఎంతో ఆలోచింపజేసేలా చేసిన దేవా కట్టా చివరికి ఎవ్వరూ ఊహించని విధంగా ఓ ట్రాజెడీ ఎండింగ్ ని చూపించాడు.అయితే ఇది జనాలకుఏ తీరున ఆకట్టుకుంటుందో అనేది చర్చనీయాంశంగా మారింది. మరి రిపబ్లిక్ సినిమా ఎండింగ్ పోర్షన్ మన తేజు కి ఎలాంటి రిజల్ట్ ను చూపిస్తోందో తెలియదు కానీ,మాస్ హీరోల సినిమాలకు ఈ ట్రాజెడీ ఎండింగ్స్ సూట్ కావని ఇప్పటికే గతంలో చాలా సార్లు నిరూపించబడింది.మాస్ ప్రేక్షకులను ని విశేషంగా ఆకట్టుకున్న వారి చిత్రాలను పరిశీలించి చూస్తే విషాదాంతాలు అంతగా అలరించాలేదనే తెలుస్తోంది... !!

మరింత సమాచారం తెలుసుకోండి: