సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే సాధారణ విషయం కాదు. టాలెంట్, అందం, అభినయం ఉంటే తప్ప సాధారణ వ్యక్తులు ఇందులో రాణించలేరు. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉండి.. సెలబ్రిటీల వారసులు, చైల్డ్ ఆర్టిస్టులు కూడా టాలెంట్ లేకుండా ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేరు. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఇదే పరిస్థితి. చాలా మంది హీరో హీరోయిన్లు చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. ప్రస్తుతం స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. బాలీవుడ్‌లో చాలా మంది సెలబ్రిటీలు సినీ కుటుంబానికి చెందిన వాళ్లే ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. హీరో హీరోయిన్లుగా నిలదొక్కుకుంటున్నారు.

సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరిదైనా చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు తెగ వైరల్ అవుతుంటుంది. చిన్నప్పటి ఫోటో ఏ హీరోది, ఏ హీరోయిన్‌ది అని తెలుసుకోవడానికి నెటిజన్లు సోషల్ మీడియాను బాగా వెతికేస్తుంటారు. హీరోహీరోయిన్లకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియా వేదికగా తెలుసుకోవచ్చు. ఇలాంటి క్రమంలోనే ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అభిమాని ఆ ఫోటోను షేర్ చేసి.. ఈ హీరోయిన్ ఎవరో చెప్పుకోండి చూద్దామని నెటిజన్లకు టాస్క్ ఇచ్చారు. ముసిముసి నవ్వులు నవ్వుతున్న ఆ చిన్నారి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఫోటో ఎవరిదో గుర్తుపట్టండి చూద్దాం.

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి బాలీవుడ్ స్టార్ హీరో కూతురు. తన ముసిముసి నవ్వులతో ఎంతో ముద్దుగా ఫోన్‌లో మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిన్నారి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీనే బిగ్గేస్ట్‌ హిట్‌ అందుకుంది. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? బాలీవుడ్ స్టార్ నటుడు శత్రుఘ్నసిన్హా కూతురు సోనాక్షి సిన్హా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సోనాక్షి.. స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన దుబాంగ్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. దబాంగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో సోనాక్షి సిన్హాకు వరుస ఆఫర్లు పెరిగాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, వరుస అవకాశాలు రావడంతో ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: