టాలీవుడ్‌లో ఇప్పుడు చాలా మంది ప్రతిభావంతులైన దర్శకులు ఉన్నారు. వారిలో క్రిష్ జాగర్లమూడి ఒకరు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన క్రిష్ టాప్ 5 సినిమాలు చూద్దాం.

గమ్యం
దర్శకుడిగా క్రిష్ జాగర్లమూడి తొలి చిత్రం గమ్యం. ఈ చిత్రంలో శర్వానంద్, అల్లరి నరేష్, కమలినీ ముఖర్జీ, రావు రమేష్ వంటి వారు అద్భుతమైన నటనను కనబరిచారు. నాలుగు నంది అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న ఈ చిత్రంలో మంచి కంటెంట్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇ

వేదం
అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క శెట్టి, మనోజ్ బాజ్‌పాయ్, శరణ్య పొన్వన్నన్ నటించిన 'వేదం' చిత్రం రెండు నంది అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మరియు మూడు సినీమా అవార్డులను సాధించింది. 2010లో వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ గా డిజాస్టర్. కమర్షియల్ గా విఫలమైనప్పటికీ టాలీవుడ్ లో ఇది ఉన్నత స్థానంలో ఉన్న సినిమా. విమర్శకుల నుండి అద్భుతమైన చలన చిత్ర సమీక్షలను సంపాదించింది. క్రిష్ జాగర్లమూడి నుండి వచ్చిన అద్భుతమైన చిత్రం.

కంచె
కంచె చిత్రానికి క్రిష్ అద్భుతమైన స్క్రిప్ట్, జ్ఞాన శేఖర్ వీఎస్ అసాధారణ కెమెరా పనితనం, చిరంతన్ భట్ అద్భుతమైన సంగీతతో పాటు వరుణ్ తేజ్ కొణిదెల, ప్రగ్యా జైస్వాల్, శ్రీనివాస్ అవసరాల, గొల్లపూడి మారుతీ రావు మెచ్చుకోదగిన నటనను అందించారు. ఇది ఉత్తమ స్థాయి సినిమా. దారుణమైన బాక్సాఫీస్ ఫలితాలు ఉన్నప్పటికీ విమర్శకులు ఈ చిత్రాన్ని విన్నర్ గా భావించారు. మనుషుల మధ్య ఉన్న అడ్డంకులను బద్దలు కొట్టడం గురించి, లోతైన భావాలను ఈ చిత్రంలో చూడొచ్చు.

గౌతమీపుత్ర శాతకర్ణి
చక్కటి నటుడు నందమూరి బాలకృష్ణ, అద్భుతమైన కథనం, దర్శకత్వం వంటి అంశాలతో ప్రశంసలు పొందిన సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి.  ఈ చిత్రం క్రిష్ కెరీర్ లో అత్యుత్తమ ప్రదర్శనగా మిగిలి పోయింది. శాతవాహన పాలకుడు గౌతమీపుత్ర శాతకర్ణిగా బాలయ్య పాత్ర చిత్రీకరణ బెస్ట్. దర్శకుడు క్రిష్ ఈ సినిమాలో బాలయ్య కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్‌ని బయటపెట్టాడు. అంతేకాకుండా శ్రియ శరణ్‌తో ఆయన అద్భుతమైన ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: