హీరోయిన్ లిస్సీ నటించిన కొన్ని సినిమా వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈమె తొలిసారిగా తెలుగులో నటించిన చిత్రం సాక్షి. 1989 వ సంవత్సరంలో ఈ సినిమా లో రాజేంద్ర ప్రసాద్, జయసుధ, చంద్ర మోహన్ వంటి వారు నటించారు. ఇక ఇందులో హంతకుడిని పట్టుకొనే పాత్రలో లిస్సీ నటించింది. రాజేంద్రప్రసాద్ పక్క నటించి మంచి మార్కులు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా సక్సెస్ కావడానికి ప్రధాన పాత్రలో నటించిందని చెప్పవచ్చు.


ఇక తర్వాత 1995 ఆగస్టు 7 న రాజశేఖర్ తో కలసి మగాడు అనే సినిమాలో నటించింది. ఇక ఈ సినిమాకి బెస్ట్ యాక్టర్ గా కూడా రాజశేఖర్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఈ సినిమాలో కూడా ఈమె కీలక పాత్రలో నటించింది. ఇక తర్వాత ఈమె స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కించుకుంది. అటు తర్వాత దోషి నిర్దోషి అనే సినిమాలో కూడా నటించింది. ఇక ఇందులో సుమన్, శోభన్ బాబు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో శోభన్ బాబు ఒక విభిన్నమైన పాత్రలో నటించాడు.
ఇక హీరో సుమన్ తో కలిసి మరొకసారి 20వ శతాబ్దం అనే సినిమా కూడా చేసింది. ఇక ఆ తరువాత రమ్యకృష్ణతో కలిసి అక్కచెల్లెలుగా"మాయ శ్రీ" సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా మా అంతగా ఆశించిన ఫలితం దక్కలేదు. ఇక మరొక సారి కూడా సుమన్ కు జోడిగా ఆత్మ బంధం అనే సినిమాలో నటించింది.

ఆ తర్వాత సీనియర్ హీరో సరసన శివశక్తి అనే సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక ఈమె చివరి గా నటించిన చిత్రం స్టువర్టుపురం పోలీస్ స్టేషన్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కేవలం మీద తన హవాను రెండు సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. ఇక తాజాగా చల్ మోహన్ రంగ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది లిస్సీ.ఈ సినిమా ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: