బాలీవుడ్ యంగ్ అండ్ పాపులర్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తన రాబోయే చిత్రం 'అత్రంగి రే' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ నేరుగా డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదలకు రెడీ అవ్వడంతో చిత్రబృందం దూకుడుగా ప్రమోట్ చేస్తోంది. ఇది డిసెంబర్ 24న ప్రసారం కానుంది. ఈ ఆసక్తికరమైన లవ్ ఎంటర్‌టైనర్‌ ను చూడటానికి ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధనుష్, అక్షయ్ కుమార్ హీరోలుగా నటిస్తుండగా సారా కథానాయికగా నటిస్తోంది.

ఈ సందర్భంగా సారా బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ధనుష్ వంటి జాతీయ అవార్డు విజేత, ఆనంద్ ఎల్ రాయ్ వంటి ప్రతిభావంతులైన దర్శకుడితో కలిసి పని చేసిన అనుభవాన్ని వివరించింది. అమ్మాయిలపై సమాజం విధించిన నిబంధనలన్నీ మూర్ఖత్వమని, వాటిని విస్మరించాలని ప్రతి ఒక్కరినీ కోరుతూ కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఆమె రణ్‌వీర్ సింగ్ తో పాటు చాలా మంది ఇతరుల పట్ల తనకున్న అభిమానం గురించి కూడా మాట్లాడింది.

ప్రెస్ మీట్ లో ఆమె టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి నటించాలనే కోరిక ను బయట పెట్టింది. 'అర్జున్ రెడ్డి' స్టార్ చాలా మంది బాలీవుడ్ బ్యూటీల హృదయాన్ని దోచుకున్నట్లు కనిపిస్తోంది. జాన్వీ కపూర్ తనతో కలిసి పని చేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది. సారా అలీ ఖాన్ కూడా విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొంది. విజయ్ కూల్ మాత్రమే కాదు చాలా హాట్ గా కూడా ఉంటాడని ఆమె చెప్పింది.

పూరీ జగన్నాధ్ దర్శకత్వం లో 'లైగర్' సినిమాతో బాలీవుడ్‌ లోకి అడుగు పెట్టబోతున్నాడు దేవరకొండ. అతను ఆ చిత్రం లో అనన్య పాండేతో రొమాన్స్ చేయనున్నాడు. అది హిట్ అయితే దేవరకొండ బాలీవుడ్లోని పెద్ద దర్శకులు, అందమైన హీరోయిన్లందరితో కలిసి పని చేయబోతున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: