టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు, ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ విజయాలతో విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇలా టాలీవుడ్ లో అనేక మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న  లైగర్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలా బాలీవుడ్ లో ఇప్పటికీ ఒక్క సినిమా కూడా విడుదల చేయని విజయ్ దేవరకొండ అక్కడి హాట్ హీరోయిన్ లను మాత్రం ఇప్పటికే ఫిదా చేశాడు.  కొన్ని రోజుల క్రితమే మీకు ద‌క్షిణాదిన న‌చ్చే హీరో ఎవ‌రు అని అడిగిన ప్ర‌శ్న‌కు బాలీవుడ్ హీరోయిన్, శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్‌... విజ‌య్ దేవ‌ర‌కొండ అని ఏ మాత్రం త‌డుముకోకుండా స‌మాధానం చెప్పేసింది.

ఇప్పుడు జాన్వీ కపూర్ ను తన ఫ్రెండ్ కూడా ఫాలో అవుతోంది. ఇంత కీ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను ఫాలో అవుతున్న తన ఫ్రెండ్ ఎవరా అనుకుంటున్నారా.. తాను మరెవరో కాదు సారా అలీ ఖాన్. ఈ హాట్ బ్యూటీ కూడా త‌న‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే చాలా ఇష్ట‌మ‌ని సిగ్గు ఒల‌క‌బోసింది.
అసలు విషయంలోకి వెళితే..
అక్ష‌య్ కుమార్‌, ధ‌నుష్‌ ల‌తో క‌లిసి సారా అలీ ఖాన్ అత్రంగి రే సినిమాలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ప్ర‌మోష‌న్ లు జ‌రుగుతున్న స‌మ‌యంలో మీ ఫేవ‌రేట్ స్టార్ ఎవ‌రు అని అడిగితే విజ‌య్ దేవ‌ర‌కొండ అని చెప్పేసింది. విజయ్ దేవరకొండ చాలా కూల్ గా కనిపిస్తాడు, హాట్ హీరో అని సారా అలీ ఖాన్ బోల్డ్ గా చెప్పేసింది. తన తో నటించాలి అని ఉందని తన మనసులో మాటను సారా అలీ ఖాన్ బయటపెట్టేసింది. ఇలా విజయ్ దేవరకొండ పై బాలీవుడ్ హాట్ బ్యూటీ సారా అలీ ఖాన్ కామెంట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: