అంతకుముందు యూట్యూబ్ యాంకర్ గా ఉన్న అరియానా బిగ్ బాస్ తర్వాత సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 బజ్ ఇంటర్వ్యూస్ చేస్తున్న అరియానా సినిమాల్లో కూడా ప్రయత్నాలు చేస్తుంది. రీసెంట్ గా వచ్చిన రాజ్ తరుణ్ అనుభవించు రాజా సినిమాలో ఆమె నటించింది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీని బాగా వాడేస్తున్న అరియానా తన సోషల్ మీడియా వీడియోస్ తో ఆడియెన్స్ ను మరింత ఎట్రాక్ట్ చేస్తుంది. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో సమంత చేస్తున్న స్పెషల్ సాంగ్ ఉ అంటావా మావ సాంగ్ కి డ్యాన్స్ చేస్తూ అమ్మడు రచ్చ చేసింది.

ఉ అంటావా మావా అంటూ నడుము అందాలతో అరియానా డ్యాన్స్ తన వయ్యారాలతో ఆడియెన్స్ ను అలరిస్తుంది. ఓ పక్క యాంకరింగ్ చేస్తూ సత్తా చాటుతున్న అమ్మడు మరోపక్క ఇలా డ్యాన్సులు గట్రా చేస్తూ ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ వల్ల తన లైఫ్ స్టైల్ మారగా ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో మాత్రం అరియానా పర్ఫెక్ట్ ప్లాన్ ఫాలో అవుతుంది. ఇక మెయిన్ లీడ్ గా ఛాన్సులు రావాలంటే ఆ మాత్రం చేయకపోతే ఎలా అని ఫ్యాన్స్ అంటున్నారు.

పుష్ప సినిమాలో సమంత చేసిన ఊ అంటావా సాంగ్ ను సమంతని మించేలా తన అందాలతో అదరగొట్టింది అరియానా. వర్మ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా ఫేం అయిన ఈ బ్యూటీ బిగ్ బాస్ వల్ల క్రేజ్ తెచ్చుకుని తనకు వచ్చిన ఫాలోవర్స్ ను ఇంప్రెస్ చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇదే జోరు కొనసాగిస్తే అరియానాకి మంచి ఛాన్సులే వచ్చే వీలుటుందని చెప్పొచ్చు. అరియానా కూడా ప్రస్తుతం స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటుతుండగా సిల్వర్ స్క్రీన్ ఆఫర్ల కోసం ఈగర్ గా ఎదురుచూస్తుంది. అలాంటి ఆఫర్ అరియానాకి రావాలని ఆశిద్దాం.





మరింత సమాచారం తెలుసుకోండి: